Kantara: త్వరలో కుందాపురానికి ‘కాంతార 1’

‘కాంతార’ సినిమాతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు రిషబ్‌ శెట్టి. ఇప్పుడీ సినిమాకి ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్‌ 1’ సిద్ధమవుతోంది. రిషబ్‌ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Updated : 04 May 2024 09:41 IST

‘కాంతార’ సినిమాతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు రిషబ్‌ శెట్టి. ఇప్పుడీ సినిమాకి ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్‌ 1’ సిద్ధమవుతోంది. రిషబ్‌ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. గత కొన్నాళ్లుగా పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా ఇప్పుడు చిత్రీకరణ ప్రారంభించుకునేందుకు సిద్ధమైంది. వచ్చే వారంలోనే ఈ చిత్ర తొలి షెడ్యూల్‌ మొదలు కానుందని సమాచారం. ఇందుకోసం కుందాపురలోని తీర ప్రాంతంలో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేసింది చిత్ర బృందం. దాదాపు 20రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కుందాపుర పరిసర ప్రాంతాల్లోని అడవుల్లోనూ.. అక్కడ నిర్మించిన సెట్‌లోనూ కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా కోసం రిషబ్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాగణం కళరిపయట్టు, గుర్రపు స్వారీలో కఠిన శిక్షణ తీసుకుంటున్నారు. ఈ చిత్రానికి అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతమందిస్తుండగా.. అరవింద్‌ కశ్యప్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని