Vani kapoor: వాణీ కోసమే ఈ పాత్ర!

నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది బాలీవుడ్‌ నాయిక వాణీ కపూర్‌. ఇప్పుడామె మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ఆమె ప్రధాన పాత్రలో ‘బడ్తమీజ్‌ గిల్‌’ అనే సినిమా రాబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

Updated : 04 May 2024 09:38 IST

టనకు ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది బాలీవుడ్‌ నాయిక వాణీ కపూర్‌. ఇప్పుడామె మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ఆమె ప్రధాన పాత్రలో ‘బడ్తమీజ్‌ గిల్‌’ అనే సినిమా రాబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. నవజ్యోత్‌ గులాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘‘ఈ కథకు అందంతోపాటు ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి అవసరం. తన స్నేహితులు, కుటుంబం కోసం ఎంత దూరమైన వెళ్లాలి. వాణి నిజజీవితంలో ఇలాంటి వ్యక్తిత్వం గల అమ్మాయి. ఆమెను దృష్టిలో ఉంచుకొనే ఈ కథను తీర్చిదిద్దాము. ఈ పాత్రకు వాణి మాత్రమే సరిపోతుందని మేము బలంగా నమ్ముతున్నాము. మునుపెన్నడూ చూడని విధంగా ఇందులో ఆమెను చూపించబోతున్నాము. ఈ నెల మొదటి వారంలో చిత్రీకరణను ప్రారంభించనున్నామ’’ని చిత్రబృందం తెలిపింది. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో పరేష్‌ రావేల్‌, అపర్శక్తి ఖురానా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిక్కీ భగ్నానీ, విక్కీ భగ్నానీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ‘రైడ్‌ 2’, ‘ఖేల్‌ ఖేల్‌ మే’ చిత్రాలతో బిజీగా ఉంది వాణీ కపూర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని