Rajiniakanth: సమ్మోహనం.. ఈ కలయిక

అపూర్వమైన కలయికలు కొన్ని ఉంటాయి. వాళ్లు కలిశారంటే చాలు... సినిమాకి క్లాప్‌ కొట్టిన రోజే బ్లాక్‌బస్టర్‌ బొమ్మని తెరపై చూసేసినంత సంబరం. రజనీకాంత్‌  - అమితాబ్‌ బచ్చన్‌ కలయిక అచ్చం అలాంటిదే. భారతదేశం గర్వించదగ్గ తారలు ఈ ఇద్దరూ.

Updated : 04 May 2024 09:40 IST

పూర్వమైన కలయికలు కొన్ని ఉంటాయి. వాళ్లు కలిశారంటే చాలు... సినిమాకి క్లాప్‌ కొట్టిన రోజే బ్లాక్‌బస్టర్‌ బొమ్మని తెరపై చూసేసినంత సంబరం. రజనీకాంత్‌  - అమితాబ్‌ బచ్చన్‌ కలయిక అచ్చం అలాంటిదే. భారతదేశం గర్వించదగ్గ తారలు ఈ ఇద్దరూ. ‘వేట్టయాన్‌’ చిత్రం కోసం కలిశారు. ఈ ఇద్దరినీ తెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపేమో ఇలా సెట్లోని ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఆ ఆత్రుతని రెట్టింపు చేస్తోంది చిత్రబృందం. తమకి మాత్రమే ప్రత్యేకం అనిపించే నటనతోనూ... సమ్మోహనం అనిపించే స్క్రీన్‌ ప్రెజెన్స్‌తోనూ ప్రేక్షకుల్ని కట్టిపడేసే ఈ ఇద్దరు తారలు ‘వేట్టయాన్‌’ సెట్‌లో సందడి చేశారు. దీన్ని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ శుక్రవారం ఎక్స్‌ ద్వారా పంచుకుంది. ఈ చిత్రానికి టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని