Hridaynath Mangeshkar: ఆసుపత్రిలో హృదయ్నాథ్ మంగేష్కర్
ప్రముఖ సంగీత దర్శకుడు హృదయ్నాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన కుమారుడు ఆదినాథ్ మంగేష్కర్ వెల్లడించారు. మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్ఠాన్ ట్రస్టు
ప్రముఖ సంగీత దర్శకుడు హృదయ్నాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన కుమారుడు ఆదినాథ్ మంగేష్కర్ వెల్లడించారు. మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్ఠాన్ ట్రస్టు ఆధ్వర్యంలో ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డు తొలి ప్రదానోత్సవం ముంబయిలోని స్థానిక షణ్ముఖానంద హాల్లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదినాథ్ తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పది రోజుల్లో అంతా సర్దుకుంటుందని తెలిపారు. హృదయ్నాథ్ ఆరోగ్యం త్వరలోనే కుదుటపడుతుందని కార్యక్రమంలో పాల్గొన్న ‘లతా దీనానాథ్ అవార్డు’ తొలి గ్రహీత ప్రధాని నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 84 ఏళ్ల హృదయ్నాథ్ ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్, ఆశా భోస్లేలకు స్వయానా సోదరుడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్‌కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM