Shankar: ‘అపరిచితుడు’ లేనట్టేనా.. శంకర్- రణ్‌వీర్‌ల భారీ స్కెచ్ ఏంటి?
శంకర్, రణ్‌వీర్ కాంబినేషన్‌లో ‘అపరిచితుడు’ రీమేక్ లేనట్టేనా? వీరిద్దరు ఏం ప్లాన్ చేశారు?
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్ (Ranveer Singh) హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ (Shankar) ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘అన్నియన్’ (అపరిచితుడు)కు రీమేక్‌గా దాన్ని రూపొందిస్తున్నట్టు గతేడాది ఎనౌన్స్ చేశారు. కానీ, ఇతర ప్రాజెక్టులతో రణ్‌వీర్, శంకర్ బిజీగా ఉండటంతో ఆ కాంబోలో తెరకెక్కనున్న సినిమాపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ఆ కాంబినేషన్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. తాము ముందుగా ప్రకటించినట్టు శంకర్, రణ్‌వీర్ ‘అపరిచితుడు’ రీమేక్ చేయట్లేదట. తమిళ ప్రసిద్ధ నవల ‘వేల్పారి’ని ఆధారంగా చేసుకొని శంకర్ ఓ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని టాక్. పెద్ద కథకావడంతో మూడు భాగాలుగా ఆ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రేక్షకులను హత్తుకునే ప్రేమకథ, మంత్రముగ్దుల్ని చేసే విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందించేందుకు రంగం చేస్తున్నారని, వచ్చే ఏడాదిలో ఆ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్తారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
విక్రమ్ హీరోగా 2005లో శంకర్ తెరకెక్కించిన ‘అపరిచితుడు’ తెలుగు, తమిళ భాషల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్నే హిందీలో తెరకెక్కించనున్నట్టు 2021 ఏప్రిల్‌లో శంకర్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన.. కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’, రామ్‌చరణ్ (#RC15)తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘సర్కస్’, ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ తదితర చిత్రాలతో రణ్‌వీర్ బిజీగా ఉన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Gangleader: మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. బాస్ మూవీ రీరిలీజ్ వాయిదా..!
-
Sports News
IND vs AUS: విరాట్‌ని ఆపకపోతే ఆస్ట్రేలియా గెలవడం చాలా కష్టం: ఆసీస్ మాజీ కెప్టెన్
-
India News
Cow Hug day: ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే కాదు.. కౌ హగ్ డే..!
-
World News
Operation Dost: విభేదాలున్నా.. తుర్కియేకు భారత్ ఆపన్నహస్తం..!
-
Movies News
Social Look: రుహానీ శర్మ రెడ్ రోజ్.. ప్రణీతకు బోర్ కొడితే?
-
General News
Andhra News: సీబీఐ విచారణ కోరుతూ రఘురామ పిటిషన్.. కేంద్రం, సీబీఐకి నోటీసులు జారీ