Brahmastra2 : ‘బ్రహ్మాస్త్ర 2’ కోసం రంగంలోకి డిస్నీ

ఓ సినిమాని విడుదలకు ముందే రెండు భాగాలుగా తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తుంటారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా రెండో భాగంవైపు అడుగులేస్తుంటాయి చిత్రబృందాలు.

Updated : 22 Oct 2022 11:22 IST

సినిమాని విడుదలకు ముందే రెండు భాగాలుగా తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తుంటారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా రెండో భాగంవైపు అడుగులేస్తుంటాయి చిత్రబృందాలు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) చిత్రానికి కూడా రెండో భాగం ఉంటుందనే ముందే చెప్పాయి చిత్రవర్గాలు. ఈ సినిమా డిస్నీ సంస్థకు బాగా నచ్చిందట. దర్శకుడు అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించిన విధానం వాళ్లను బాగా ఆకట్టుకోవడంతో ‘బ్రహ్మాస్త్ర 2’కి (Brahmastra 2) బడ్జెట్‌ కేటాయించడానికి ఆ సంస్థ ముందుకొచ్చినట్లు బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘‘బ్రహ్మాస్త్ర’ను అయాన్‌ ముఖర్జీ తీర్చిదిద్దిన విధానం డిస్నీ సంస్థకు నచ్చింది. దీన్ని ఓ ఫ్రాంఛైజీగా చేస్తే బాగుంటుందని ఆ సంస్థ భావిస్తోంది. అందుకోసం చిత్ర నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది’’అని కరణ్‌జోహార్‌ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు సమాచారం. రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని