Jersey: షాహిద్ కపూర్ ‘జెర్సీ’.. ఎమోషనల్ ట్రైలర్ చూశారా!
షాహిద్ కపూర్ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘జెర్సీ’. నాని కథానాయకుడిగా తెలుగులో వచ్చిన ‘జెర్సీ’ రీమేక్‌గా రూపొందింది.
ఇంటర్నెట్ డెస్క్: షాహిద్ కపూర్ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘జెర్సీ’. నాని కథానాయకుడిగా తెలుగులో వచ్చిన ‘జెర్సీ’ రీమేక్‌గా రూపొందింది. మృణాల్ ఠాకూర్ కథానాయిక. ఇప్పటికే ఓ ట్రైలర్‌ను పంచుకోగా తాజాగా మరో ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. షాహిద్ సిక్సర్ కొట్టే సన్నివేశంతో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకునేలా ఉంది. క్రికెటర్‌గా చూడాలనుకున్న తన కొడుకు కోరికను తీర్చేందుకు ఓ తండ్రి ఏం చేశాడు? 36ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్ బ్యాట్ పడితే అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆటలో గెలిచాడా? జీవితంలో గెలిచాడా? తదితర భావోద్వేగ అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. అల్లు అరవింద్, దిల్‌రాజు, అమన్ గిల్, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తుంచారు. అనిరుధ్ నేపథ్య సంగీతం అందించగా సాకేత్, పరంపర స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్‌కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
ఐపీఎల్ 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌కు బెయిల్