Sushanth: ‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్‌ కామెంట్‌.. హీరో ఏమన్నారంటే?

‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా సుశాంత్‌ ఏమన్నారంటే?

Published : 06 May 2024 17:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘కరెంట్‌’, ‘చి.ల.సౌ.’ తదితర చిత్రాలతో మెప్పించిన నటుడు సుశాంత్‌ (Sushanth). ఓ వైపు హీరోగా, మరోవైపు ఇతర హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి అలరించారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన తన సెల్ఫీని తాజాగా ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. ‘క్యాప్షన్‌ లేదు.. ఫర్వాలేదుగా?’ అని సరదాగా పేర్కొన్నారు. దీనిపై కొందరు నెటిజన్లు నెగెటివ్‌ కామెంట్స్‌ పెట్టినా ఆయన పాజిటివ్‌గా స్పందించారు. ‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్‌ సుశాంత్‌ పోస్ట్‌కు కామెంట్‌ పెట్టాడు. ‘నీలాంటి వాళ్లు ఉండాలి’ అంటూ ఈ నటుడు రిప్లై ఇచ్చి, అభిమానుల మనసు దోచారు. ‘క్యాప్షన్‌ లేదు అనేదే క్యాప్షన్‌’ అని ఓ యూజర్‌ కామెంట్‌ పెట్టగా .. క్యాచ్‌ చేశావ్‌ అని హీరో బదులిచ్చారు. ‘సమ్మర్‌ ఎలా ఉంది అన్నా?’ అని ఒకరు అడిగితే సమ్మర్‌లానే ఉంది అని నవ్వులు పూయించారు. ఫ్యాన్స్‌ కొత్త సినిమా అప్‌డేట్‌ కోరగా.. త్వరలోనే వివరాలు తెలియజేస్తానన్నారు.

గతేడాది విడుదలైన ‘భోళా శంకర్‌’ (Bhola Shankar) తర్వాత సుశాంత్ మళ్లీ ప్రేక్షకుల ముందుకురాలేదు. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆ సినిమాలో కీ రోల్‌ ప్లే చేశారాయన. అంతకుముందు అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo), రవితేజ ‘రావణాసుర’లో సందడి చేశారు. ‘మా నీళ్ల ట్యాంక్‌’ వెబ్‌సిరీస్‌లోనూ నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని