Jhund Teaser: ఫుట్‌బాల్‌ కోచ్‌గా అమితాబ్‌.. ఆసక్తికరంగా ‘ఝుండ్‌’ టీజర్‌

సినీ ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు వస్తోంది. బయోపిక్స్‌, క్రీడల ఆధారంగా వస్తున్న సినిమాలకు ఆదరణ దక్కుతుంది.

Published : 08 Feb 2022 17:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు వస్తోంది. బయోపిక్స్‌, క్రీడల ఆధారంగా వస్తున్న సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ఈక్రమంలో బాలీవుడ్‌ దిగ్గజం, బిగ్‌బి అమితాబ్‌ ఫుట్‌బాల్‌ శిక్షకుడి పాత్రలో నటించిన ‘ఝుండ్‌’ మార్చి 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం ‘ఝుండ్‌’ టీజర్‌ను విడుదల చేసింది.

ఓ ప్లే గ్రౌండ్‌లో బస్తీ పిల్లలంతా డప్పు శబ్దాలు చేస్తుండగా.. బిగ్‌ బి ఫుట్‌బాల్‌ కోచ్‌గా ఎంట్రీ ఇచ్చిన తీరు అదిరిపోయేలా ఉంది. అజయ్‌ అతుల్‌ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫుట్‌బాల్‌ ఆటగాడు విజయ్‌ బార్సే జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అమితాబ్‌ ఫుట్‌బాల్‌ కోచ్ పాత్రలో కనిపించనున్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి బానిసలుగా మారిన వీధి బాలలను మామూలు మనుషులుగా మార్చి వారితోనే ఫుట్‌బాల్‌ జట్టు తయారు చేస్తారు అమితాబ్‌. దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన మరాఠి చిత్రం ‘సైరాట్‌’ దర్శకుడు నాగరాజ్‌ మంజులే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 

‘సైరాట్‌’తో జాతీయ పురస్కారం సాధించిన దర్శకుడు నాగరాజ్‌ మంజులే, అమితాబ్‌ ‘ఝుండ్‌’ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం రెండేళ్ల క్రితమే విడుదల కావాల్సిన ఉండగా  కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని