Jr NTR: బాలీవుడ్‌ స్టార్స్‌తో ఎన్టీఆర్‌.. వీడియో వైరల్‌

బాలీవుడ్‌ స్టార్స్‌ ఏర్పాటు చేసిన పార్టీలో ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఫ్యాన్స్‌ షేర్‌ చేస్తున్నారు.

Updated : 29 Apr 2024 15:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ (Jr NTR) త్వరలోనే ‘వార్‌2’తో బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఆయన ముంబయి వెళ్లారు. అక్కడ జరిగే పార్టీలకు కూడా హాజరవుతూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఏప్రిల్‌28 బీటౌన్‌ స్టార్స్‌ అందరూ కలిసి చేసుకున్న డిన్నర్‌ పార్టీలో తారక్‌ మెరిశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్‌ స్టార్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌, హృతిక్‌రోషన్‌, కరణ్‌జోహార్‌లు ఏర్పాటు చేసిన పార్టీకు ఎన్టీఆర్‌ తన భార్యతో కలిసి వెళ్లారు. అక్కడకు వచ్చిన ఫ్యాన్స్‌తో సెల్ఫీలు దిగారు.

‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్‌ రోషన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘వార్‌2’లో ఎన్టీఆర్‌ కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌ నిర్మిస్తోంది. ఇందులో తారక్‌ రా ఏజెంట్‌గా కనిపించనున్నారు. ఈ యాక్షన్‌ సినిమాలో కియారా అడ్వాణీ కథానాయిక. 2025 రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనితో పాటు కొరటాల శివ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’తోనూ ఎన్టీఆర్‌ బిజీగా ఉన్నారు. ఇందులో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) హీరోయిన్‌. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (saif ali khan) ప్రతినాయకుడి పాత్రలో కనిపించున్నారు. ఈ చిత్రం సముద్ర తీర ప్రాంతం నేపథ్యంలో పూర్తిస్థాయి యాక్షన్‌తో రెండు భాగాలుగా అలరించనుంది. మొదటి భాగాన్ని అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని