RRR: ఆ పాట కోసం నెలరోజులు షూట్‌?

‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చాలా వరకు పూర్తి చేసుకుంది. ఇంక కేవలం మిగిలింది రెండు పాటల చిత్రీకరణ మాత్రమేనట. అయినా కూడా వీటిని పూర్తి చేయడానికి కనీసం 45 నుంచి 50 రోజుల వరకు పడుతుందట.

Published : 01 Jun 2021 14:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చాలా వరకు పూర్తి చేసుకుంది. ఇంక కేవలం మిగిలింది రెండు పాటల చిత్రీకరణ మాత్రమేనట. అయినా కూడా వీటిని పూర్తి చేయడానికి కనీసం 45 నుంచి 50 రోజుల వరకు పడుతుందట. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల పరిచయ పాట చిత్రీకరణ పూర్తి కావడానికి కనీసం 30రోజులు పడుతుందని సమాచారం. ఇక మరో పాట రామ్‌చరణ్‌ - అలియాభట్‌పై చిత్రీకరించాల్సి ఉంది. సినిమా చివరి షెడ్యూల్‌ కోసం బ్లూప్రింట్‌ సిద్ధం చేస్తున్నారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే తిరిగి షూటింగ్‌ మొదలుపెట్టనున్నారని సమాచారం. 

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీత స్వరాలు అందిస్తుండగా బుర్రా సాయిమాధవ్‌ డైలాగ్స్ రాస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని  ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇంగ్లిష్‌, పోర్చుగీస్‌, కొరియన్‌, టర్కిష్‌, స్పానిష్‌ భాషల్లోనూ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కుల్ని, శాటిలైట్‌ హక్కుల్ని సొంతం చేసుకున్న పెన్‌ స్టూడియోస్‌, దాదాపు పది భాషల్లో హక్కుల్ని అమ్మింది. ఆ మేరకు ఆయా విదేశీ భాషలకి చెందిన డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్టు పెన్‌ స్టూడియోస్‌ తెలిపింది. ఇందులో హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్‌ ఎన్టీఆర్‌ సరసన కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు