Kangana Ranaut: ఆ ఫీల్ నుంచి బయటకు రావడానికి వారం పట్టొచ్చు: కంగనా రనౌత్
ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోన్న చిత్రం ‘కాంతార’. కన్నడ చిత్రంగా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది.
ముంబయి: రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార’పై (Kantara) బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన ఆమె సోషల్‌మీడియా వేదికగా తన అనుభవాన్ని పంచుకుంటూ ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. సినిమా అంటే ఎలా ఉండాలో ఈ చిత్రం తెలియజేసిందన్నారు.
‘‘కుటుంబసభ్యులతో కలిసి ఇప్పుడే ‘కాంతార’ చూశా. ఇప్పటికీ నా శరీరం వణుకుతూనే ఉంది. ఇదొక అద్భుతమైన అనుభవం. సాంప్రదాయం, జానపద కథలు, దేశీయ సమస్యల సమ్మేళనమే ఈ చిత్రం. రిషబ్ శెట్టికి హ్యాట్సాఫ్. రచన, దర్శకత్వం, నటన.. అన్నీ మరోస్థాయిలో ఉన్నాయి. ప్రకృతి అందాలను చూపించిన విధానం, యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉంది. సినిమా అంటే ఇది. ఇలాంటి చిత్రాన్ని తాము ఎప్పుడూ చూడలేదని థియేటర్‌లో ప్రేక్షకులు చెబుతున్నారు. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన టీమ్‌కు ధన్యవాదాలు. మరోవారం రోజులపాటు నేను ఈ అనుభూతిలోనే ఉంటాననిపిస్తుంది’’ అని కంగన పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral-videos News
Viral Video: చెన్నై అమ్మాయిల సరదా పని..! బకెట్లు.. డబ్బాలు.. కుక్కర్లతో కాలేజీకి..
-
Sports News
IND vs PAK: వన్డే ప్రపంచ కప్ 2023.. భారత్‌లో ఆడేది లేదన్న పాక్.. తటస్థ వేదికల్లోనే నిర్వహించాలట!
-
World News
Espionage: రష్యాలో అమెరికన్ జర్నలిస్టు అరెస్టు.. ప్రచ్ఛన్న యుద్ధానంతరం మొదటిసారి!
-
World News
African:ఆఫ్రికాలో కొత్త వైరస్.. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోనే ముగ్గురి మృతి
-
Sports News
IPL 2023: ‘ఈ సీజన్లో ఛాంపియన్‌గా నిలిచేది ఆ జట్టే’.. ముంబయి, చెన్నైలకు నో ఛాన్స్!
-
Movies News
Rana Naidu: ‘రానా నాయుడు’.. తెలుగు ఆడియో డిలీట్.. కారణమదేనా?