నిజమే.. కత్రినా-విక్కీ డేటింగ్లో ఉన్నారు
బాలీవుడ్ అందగత్తె కత్రినాకైఫ్, నటుడు విక్కీ కౌశల్ డేటింగ్లో ఉన్న మాట వాస్తవమేనని బాలీవుడ్ స్టార్ హీరో అనిల్‌కపూర్ కుమారుడు, నటుడు హర్షవర్ధన్ కపూర్ వెల్లడించారు.....
బాలీవుడ్ ప్రేమజంట గుట్టు విప్పిన నటుడు
ముంబయి: బాలీవుడ్ అందగత్తె కత్రినాకైఫ్, నటుడు విక్కీ కౌశల్ డేటింగ్లో ఉన్న మాట వాస్తవమేనని బాలీవుడ్ స్టార్ హీరో అనిల్‌కపూర్ కుమారుడు, నటుడు హర్షవర్ధన్ కపూర్ వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్షవర్ధన్ ఈ బాలీవుడ్ ప్రేమజంట గురించి వస్తోన్న వార్తలపై స్పందించారు. ‘మీరు నిజమేనని నమ్ముతున్న ఒక్క బాలీవుడ్ జంట లవ్ రూమర్స్‌పై స్పందించగలరు’ అని విలేకరి ప్రశ్నించగా.. ‘విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ రిలేషన్షిప్లో ఉన్నారు. అది నిజం. ఒకవేళ ఈ విషయాన్ని బయటపెట్టడం వల్ల నాకేమైనా ఇబ్బందులు వస్తాయేమో? నాకు కూడా తెలియదు. అయినా తమ మధ్య ఉన్న బంధం గురించి ఇప్పటికే వాళ్లు ఎన్నో సందర్భాల్లో చెప్పకనే చెప్పేశారు’ అని తెలిపారు.
కత్రినాకైఫ్-విక్కీ కౌశల్ గత కొన్ని సంవత్సరాల నుంచి స్నేహితులుగా ఉన్నారు. బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లల్లో జరిగే ఫంక్షన్లకు సైతం వీరిద్దరూ కలిసే వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గడిచిన రెండేళ్ల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించమని ఇప్పటికే పలుమార్లు విక్కీ అడగ్గా .. వ్యక్తిగత జీవితం గురించి బయటపెట్టడం తనకు అంతగా ఇష్టం ఉండదని మాట దాటవేశారు. ఇక, కత్రినాకైఫ్ వీళ్ల బంధంపై ఎప్పుడూ నోరు విప్పలేదు. మరోవైపు, తాజాగా విక్కీ కౌశల్.. కత్రినా ఇంటికి కూడా వెళ్లి వచ్చారు. ఆరు గంటలపాటు ఆమె కుటుంబంతోనే ఆయన సమయాన్ని గడిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్‌న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు