MAD Movie Review: రివ్యూ: మ్యాడ్.. సరికొత్త యూత్ ఎంటర్టైనర్ ‘మ్యాడ్’ ఎలా ఉంది?
MAD Movie Review: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించిన ‘మ్యాడ్’ ఎలా ఉంది?
MAD Movie Review: చిత్రం: మ్యాడ్; నటీనటులు: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, అనుదీప్, మురళీధర్ గౌడ్, రఘుబాబు తదితరులు; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; సినిమాటోగ్రఫ్రీ: శ్యామ్ దత్ -దినేష్ క్రిష్ణన్ బి; ఎడిటింగ్: నవీన్ నూలి; సమర్పకులు: నాగవంశీ; నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య; రచన-దర్శకత్వం: కల్యాణ్ శంకర్; విడుదల తేదీ: 06-10-2023
కాలేజీ నేపథ్యంగా వచ్చే సినిమాలకు ఎప్పుడూ యువత నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. కథ లేకపోయినా యువతకు నచ్చే కథాంశాలుంటే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద కనక వర్షాన్ని కురిపిస్తుంది. అలాంటి మరో చిత్రమే మ్యాడ్ . ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ , సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు మరికొంత మంది నూతన నటీనటులు తెలుగు తెరకు పరిచయమయ్యారు. వారంతా కలిసి మ్యాడ్‌లో చేసిన హంగామా ఏంటో తెలుసుకుందాం.
కథేంటంటే: మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE) విద్యార్థులు. భగవాన్ క్యాంటిన్ విషయంలో జరిగిన బాస్కెట్ బాల్ పోటీలో విజేతగా నిలిచి మంచి స్నేహితులవుతారు. మనోజ్ శృతి(గౌరి)ని ప్రేమిస్తుంటాడు. జెన్నీ(అనంతిక) అశోక్ ఇష్టపడుతుంటుంది. దామోదర్ అలియాస్ డీడీకి గుర్తుతెలియని వెన్నెల అనే అమ్మాయి లవ్ లెటర్ రాసి తనను ప్రేమలో పడేలా చేస్తుంది. హాస్టల్‌కు ఫోన్ చేసి రోజూ డీడీతో ప్రేమగా మాట్లాడుతుంటుంది. వెన్నెలను చూడకుండానే డీడీ నాలుగేళ్లు గడిపేస్తాడు. చివరకు వెన్నెలను వెతికే క్రమంలో డీడీకి తెలిసిన నిజం ఏంటీ? మధ్యలో లడ్డు(విష్ణు) కథేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: కాలేజి క్యాంపస్‌లో చదువులు, విద్యార్థుల మనస్తత్వాలు, పోటీ ప్రపంచంలో విద్యార్థులు నలిగిపోయే తీరు ఎప్పటికీ కథా వస్తువులే. ఒక్కో దర్శకుడు ఒక్కో విధానంలో వాటిని తెరకెక్కించి యువతను ఆకట్టుకున్నారు. హ్యాపీడేస్ , కేరింత, 3 ఇడియట్స్ లాంటి చిత్రాలే ఇందుకు నిదర్శనం. అయితే ఈ మ్యాడ్ చిత్రం కూడా అదే కోవకు చెందింది. చదువులు, ర్యాగింగ్ , ర్యాంకులు జోలికి పోకుండా విద్యార్థులు ప్రవర్తించే తీరు, వారి మాటలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు దర్శకుడు కల్యాణ్ శంకర్. బయట ఎంత మంది ఫ్రెండ్స్ అయినా దొరకొచ్చు, కానీ కాలేజిలో దొరికే స్నేహం ఎంతో మధురంగా, స్వచ్ఛంగా ఉంటుందనే విషయాన్ని మ్యాడ్ రూపంలో తెరకెక్కించాడు. ప్రధాన పాత్రధారులైన మనోజ్, అశోక్, దామోదర్ల పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకొని మ్యాడ్ అనే టైటిల్ పెట్టడం ఆకట్టుకుంటుంది.
RIEలో చదువుకోవడం ఇష్టం లేక ఓ విద్యార్థి పారిపోయే సంఘటన నుంచి మొదలయ్యే మ్యాడ్ కథ.... చివరకు ఆ విద్యార్థి RIEలోనే చదివి తీరుతాననే నిర్ణయంతో ముగుస్తుంది. ఆ విద్యార్థిని మోటివేట్ చేసేందుకు లడ్డు పాత్ర ద్వారా 2016లో జరిగిన కథను వివరించడం కొత్తగా అనిపిస్తుంది. ప్రథమార్ధం ప్రధాన పాత్రల పరిచయం, క్యాంపస్ కబుర్లు, ప్రేమ కబుర్లతో సాగిపోతుంది. ద్వితీయార్ధంలో వెన్నెల కోసం డీడీ వెతుకులాట, మనోజ్ , అశోక్ ప్రేమ జంటల ఊసులు, లేడీస్ హాస్టల్లో డీడీ గ్యాంగ్ హంగామా కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. కథగా చూసుకుంటే పెద్దగా చెప్పడానికి లేకపోయినా.. కథనంలో పాత్రలు ప్రవర్తించే తీరు, వారి మధ్య సంభాషణలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఆద్యంతం ఎక్కడా విసుగు లేకుండా ప్రతి సన్నివేశం వినోదాన్ని పంచుతూ సాగడం.. ప్రేక్షకులకు రెండు గంటలపాటు ఇంజనీరింగ్ కాలేజిలో ఉన్నామనే భావన కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే: మ్యాడ్‌లో ఉన్న ప్రతి పాత్రకు ప్రాధాన్యత దక్కింది. ఈ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన నార్నె నితిన్.. అశోక్ పాత్రలో లీనమైపోయాడు. సినిమా ప్రారంభ సన్నివేశాల్లో సీరియస్ లుక్‌లో కనిపించినా పతాక సన్నివేశాలకు వచ్చే సరికి ఈజీగా చేసుకుంటూ వెళ్లాడు. తన ఎలివేషన్ సీన్స్ ఫర్వాలేదనిపిస్తాయి. ఇక సంగీత్ శోభన్ , విష్ణుల పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంగీత్ శోభన్ వేగంగా చెప్పే సంభాషణలు, తన నటన తీరుతో నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. లడ్డూగా విష్ణు తన కామెడి టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. మనోజ్ పాత్రలో రామ్ నితిన్ లవ్లీ బాయ్‌గా కనిపించి సందడి చేశాడు. అమ్మాయిలు గౌరి, అనంతిక చక్కటి నటన ప్రదర్శించారు. రఘుబాబు, మురళీధర్ గౌడ్లు తమ పాత్రల పరిధి మేర నవ్వులు పంచారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ అతిథి పాత్రలో మెరిసి కేకలు పుట్టించాడు. ఇతర పాత్రల్లో కనిపించిన నూతన నటీనటులంతా బాగా చేశారు. దర్శకుడు కల్యాణ్ శంకర్ మ్యాడ్ కథను తీర్చిదిద్దన విధానం బాగుంది. గతంలో వచ్చిన సినిమాల తాలుకు ఛాయలు కనిపించకుండా తాను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా సులభంగా చెప్పేశాడు. ముఖ్యంగా సంభాషణల విషయంలో కల్యాణ్ రాసిన మాటలు ప్రతి సన్నివేశంలో నవ్వులు పంచాయి. పాటల విషయంలో భీమ్స్ మరింత శ్రద్ధ పెట్టాల్సింది. శ్యామ్ దత్ - దినేష్ క్రిష్ణన్‌ల సినిమాటోగ్రఫి క్యాంపస్ వాతావరణాన్ని, పాత్రలను అందంగా చూపించింది. నిర్మాణం పరంగా ఉన్నతంగా అనిపించింది. నిర్మాతగా అడుగుపెట్టిన హారిక సూర్యదేవరకు మొదటి ప్రయత్నం బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు.
- బలాలు
- + నటీనటుల నటన
- + హాస్యం
- + సంభాషణలు
- బలహీనతలు
- - పాటలు
- - కథ పెద్దగా లేకపోవడం
- చివరకు: ఈ మ్యాడ్ .. ఆద్యంతం నవ్వుల రైడ్‌గా ఆకట్టుకుంటుంది.
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘రాయన్’ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను అలరించిందా? -
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్‌తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
రాజ్‌తరుణ్ కథానాయకుడిగా రామ్ భీమన దర్శకత్వంలో రూపొందిన ‘పురుషోత్తముడు’ మూవీ ప్రేక్షకులను అలరించిందా? -
రివ్యూ: బహిష్కరణ.. అంజలి వేశ్యగా నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
హీరోయిన్ అంజలి, శ్రీతేజ ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ ‘బహిష్కరణ’. ‘జీ 5’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ రివ్యూ మీకోసం.. -
రివ్యూ: బ్యాడ్ న్యూజ్.. విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీ మూవీ అలరించిందా?
Bad Newz movie review: విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీ కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్ ఎంటర్టైన్ ఎలా ఉంది? -
రివ్యూ: డార్లింగ్.. ప్రియదర్శి, నభానటేష్‌ల కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా?
ప్రియదర్శి, నభానటేష్ జంటగా నటించిన రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే? -
రివ్యూ: భారతీయుడు2.. కమల్, శంకర్ కాంబో మరోసారి హిట్ అయిందా?
indian 2 review: కమల్‌హాసన్, సిద్ధార్థ్, రకుల్ కీలక పాత్రల్లో శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు2’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ధూమం.. ఫహద్ ఫాజిల్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
ఫహద్ ఫాజిల్, అపర్ణా బాలమురళి కీలక పాత్రల్లో నటించిన ‘ధూమం’ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: శశి మథనం.. ప్రేమికుడు ఎరక్కపోయి ఇరుక్కుంటే?
సోనియా సింగ్, పవన్ సిద్ధు నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే! -
రివ్యూ: వెబ్‌సిరీస్: మీర్జాపూర్ సీజన్-3.. క్రైమ్, యాక్షన్ సిరీస్-3 మెప్పించిందా?
Mirzapur Season 3 Review: యువతను విశేషంగా ఆకట్టుకున్న సిరీస్‌ల్లో మీర్జాపూర్ ఒకటి. ఇప్పుడు మూడో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: ‘గురువాయూర్ అంబలనాదయిల్’.. మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
Guruvayoor Ambalanadayil Review: పృథ్వీరాజ్ సుకుమార్, బసిల్ జోసెఫ్ కీలక పాత్రల్లో విపిన్ దాస్ దర్శకత్వం వహించిన ‘గురువాయూర్ అంబలనాదయిల్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: ‘కల్కి 2898 ఏడీ’.. ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఎలా ఉంది?
kalki 2898 ad review in telugu: ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: యక్షిణి.. సోషియో ఫాంటసీ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
Yakshini review in telugu: వేదిక, రాహుల్ విజయ్, మంచు లక్ష్మీ, అజయ్ కీలక పాత్రల్లో నటించిన ‘యక్షిణి’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
రివ్యూ: పరువు.. నివేదా పేతురాజ్ నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
హీరోయిన్ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj), నటుడు నరేశ్ అగస్త్య (Naresh Agastya), నాగబాబు (Nagababu) ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ ‘పరువు’ (paruvu). ‘జీ 5’లో విడుదలైన ఈ సిరీస్ రివ్యూ మీకోసం.. -
రివ్యూ: హరోం హర.. సుధీర్‌బాబు ఖాతాలో హిట్ పడిందా?
సుధీర్‌బాబు, మాళవిక శర్మ, సునీల్ కీలక పాత్రల్లో నటించిన ‘హరోం హర’ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మహారాజ.. విజయ్ సేతుపతి 50వ మూవీ మెప్పించిందా?
Maharaja Review: వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న విజయ్‌సేతుపతి కెరీర్లో 50వ చిత్రం ‘మహారాజ’. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఏ మేరకు మెప్పించింది? -
రివ్యూ: మిరల్.. ‘ప్రేమిస్తే’ భరత్ నటించిన చిత్రం భయపెట్టిందా?
ప్రేమిస్తే సినిమా హీరో భరత్ నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘మిరల్’. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. రివ్యూ మీకోసం.. -
రివ్యూ: కల్కి.. టొవినో థామస్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉంది?
మలయాళంలో మంచి టాక్ సొంతం చేసుకున్న టొవినో థామస్ యాక్షన్ ఫిల్మ్ ‘కల్కి’ మెప్పించిందా? -
రివ్యూ: మనమే.. శర్వానంద్, కృతిశెట్టిల మూవీ ఎలా ఉంది?
Manamey Movie Review: శర్వానంద్, కృతిశెట్టి జంటగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా మెప్పించిందా? -
రివ్యూ: సత్యభామ.. కాజల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ టాక్ ఏంటి?
కాజల్ ప్రధాన పాత్రలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో వచ్చిన క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: మిస్టర్ అండ్ మిసెస్ మహి: జాన్వీకపూర్ స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
Mr And Mrs Mahi Review: రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా శరణ్ శర్మ తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉంది? -
రివ్యూ: కీచురాళ్ళు.. మలయాళ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?
మలయాళంలో విజయవంతమైన ‘కీడమ్’ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్’లో ‘కీచురాళ్ళుగా’ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే?
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అంగరంగ వైభవంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్ వేడుకలు
-
ఐడెంటిటీ మార్చుకోవాల్సి వస్తే: విజయ్ ఆంటోనీ సమాధానమేంటంటే?
-
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
-
డేటింగ్ యాప్‌లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ