Cinema News: మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలు. మే నెలలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కథానాయకుడు శ్రీవిష్ణు గురువారం టీజర్‌ని విడుదల చేశారు. ఇద్దరు కొడుకులు, ఓ కూతురున్న ఓ కుటుంబ కథతో రూపొందిన చిత్రమిది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఓ మధ్య తరగతి కుటుంబంలో జరిగిన కొన్ని సంఘర్షణలతో రూపు దిద్దుకున్న కథ ఇది. ప్రేమ నేపథ్యంతోపాటు, మనసుకు హత్తుకునే కుటుంబ భావోద్వేగాలు ప్రధానబలం. మే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మా టీజర్‌ని విడుదల చేసిన కథానాయకుడు శ్రీవిష్ణుకి అభినందనలు. కుటుంబ కథతో తెరకెక్కిన ఈ చిత్రం, కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంద’’న్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, శివచందు, యశస్విని, మొయిన్, మోహిత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సిద్ధార్థ స్వయంభు.
‘డార్లింగ్’ నభా?
మధ్యలో కొంచెం విరామం ఇచ్చిన నభా నటేశ్ మళ్లీ జోరు పెంచింది.నిఖిల్‌తో ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తున్న ఈమె, మరికొన్ని సినిమాలతోనూ బిజీగా గడుపుతోంది. ‘బలగం’ ఫేమ్ ప్రియదర్శితో కలిసి ఓ ప్రేమకథలో నటిస్తోంది. డార్లింగ్ అనే మాటకీ, ఈ కథకీ సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసమే కథానాయకుడు ప్రభాస్‌ని అనుకరిస్తూ ఓ వీడియో చేసింది నభా. ప్రభాస్ తన సన్నిహితుల్ని డార్లింగ్ అని సంబోధిస్తుంటారు. ఆ మాట ఆయన ఊతపదం కూడా. ‘డార్లింగ్’ అనే పేరుతో సినిమా కూడా చేశారు. ప్రియదర్శి, నభా కలిసి చేస్తున్న సినిమాకి ‘డార్లింగ్’ అనే పేరు పెట్టే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ప్రియదర్శి, నభా నటేశ్ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరమైన చర్చ సాగింది.
ప్రియమైన దొంగ
అభినవ్ గోమఠం టైటిల్ పాత్రలో బీఎస్ సర్వాంగ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. గోజల మహేశ్వర్ రెడ్డి నిర్మాత. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా శుక్రవారం ఓటీటీ వేదిక ఆహాలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే నటుడు ప్రియదర్శి ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా అభినవ్ గోమఠం మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం చూశాను. ఆద్యంతం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ స్క్రిప్ట్‌ను శాలినీనే సిద్ధం చేసుకుంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. తప్పకుండా ఇది అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘ఈ కథని తొలుత మేము వెబ్‌సిరీస్‌లా చేద్దాం అనుకున్నాం. కానీ, ఇది సినిమాగా బాగుంటుందని అర్థమై ఆ ప్రయత్నం చేశాం’’ అంది నటి, రచయిత శాలిని. ఈ కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి, అజయ్ అరసాడ, నిఖిల్, దివ్య శ్రీపాద తదితరులు పాల్గొన్నారు.
కలల సైకలాజికల్ చిత్రం
ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రాంరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్ ప్రధాన పాత్రధారులుగా... సందీప్ కాకుల స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘డ్రీం క్యాచర్’. ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల వేడుక హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘‘కలల నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. మా కథలో ఎవరు ఎలాంటి కలలు కన్నారు? అవి ఎలా సాకారం అయ్యాయనేది తెరపైనే చూడాలి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రోహన్ శెట్టి, ఛాయాగ్రహణం: ప్రణీత్ గౌతమ్ నంద, కూర్పు: ప్రీతం గాయత్రి.
సిగ్గులల్ల సీతలెక్క సక్కగున్నాదే..
రాకేశ్ వర్రె ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాత. వైశాలిరాజ్, రియా సుమన్ ముఖ్యపాత్రలు పోషించారు. మే 3న రానున్న ఈ సినిమాలోని ‘లచ్చుమక్క అర్చనక్క పిల్ల సూడండే... సిగ్గులల్ల సీతలెక్క సక్కగున్నాదే...’ అంటూ సాగే పాటని గురువారం విడుదల చేశారు. గోపీసుందర్ స్వరపరిచిన ఈ గీతానికి రాంబాబు గోసాల సాహిత్యం అందించగా, మంగ్లీ ఆలపించారు. పెళ్లి నేపథ్యంలో సాగే పాట ఇది. నిర్మాత మాట్లాడుతూ ‘‘1980 కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. సహజత్వం, మలుపులతో కూడిన ఈ చిత్రం ఇంటిల్లిపాదికీ నచ్చేలా ఉంటుంద’’న్నారు. ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు , రవి ప్రకాశ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కీర్తి సురేశ్‌తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్‌తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్‌పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!
కృష్ణ హీరోగా తెరకెక్కిన ‘అల్లూరి సీతారామరాజు’ విడుదలై నేటికి 50 ఏళ్లు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలివీ.. -
సంచలనానికి 50 ఏళ్లు.. ‘అల్లూరి సీతారామరాజు’ తెర వెనక ఎన్ని విశేషాలో..!
‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా గురించి ప్రత్యేక కథనం. -
‘తుపాకీ పట్టి..’ బాక్సాఫీస్‌కు గురిపెట్టి!
కథానాయకులిచ్చే ప్రేమ గులాబీలు అందుకుంటూ.. వాళ్లతో చెట్టాపెట్టాలేసుకుని ఆడిపాడుతూ తెరపై హొయలొలికించే కథానాయికలు ఇప్పుడు తమలోని మరో కోణాన్ని పరిచయం చేస్తున్నారు. తుపాకీ పట్టి యాక్షన్ తూటాలు పేలుస్తూ బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నారు. -
పెళ్లి తేలికైన విషయం కాదు!
‘‘అసభ్యతకు తావులేని మంచి వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఇది ఒక చక్కటి జీవిత అనుభవాన్ని పంచుకునేలా ఆలోచింపజేసేలా ఉంటుంద’’న్నారు అబ్బూరి రవి. ఆయన రచయితగా వ్యవహరించిన ఈ సినిమాని మల్లి అంకం తెరకెక్కించారు. -
బాహుబలి నుంచి యానిమేటెడ్ సిరీస్
ప్రభాస్ - రాజమౌళి కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో ‘బాహుబలి’ సిరీస్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పుడీ ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి ఓ యానిమేటెడ్ సిరీస్ రానుంది. -
సీమ కథతో తొలిసారి
విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో ఓ సినిమా చేయనున్నారు. -
అందర్నీ మెప్పించడం సాధ్యం కాదు
‘కెరీర్లో జయాపజయాలు సహజం. అవి ఎంతమాత్రం నాపై ప్రభావం చూపించవు. ప్రేక్షకులు మెచ్చేలా నటించుకుంటూ వెళ్లడమే నా పని’ అంటోంది అలయా ఎఫ్. ఇటీవలే తను నటించిన ‘బడేమియా ఛోటేమియా’ భారీ వసూళ్లు రాబట్టడం లేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విధంగా బదులిచ్చింది అలయా. -
వేడుకలా షబానా 50 ఏళ్ల సినీ ప్రయాణం
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ చలనచిత్ర పరిశ్రమలో విజయవంతంగా 50ఏళ్లను పూర్తి చేసుకున్నారు. ఈమె ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎన్వైఐఫ్ఫ్) ఓ వేడుకను నిర్వహించనుంది. -
ముందుగానే ‘టర్బో’ రాక
వైవిధ్యమైన కథలు, పాత్రలతో అలరిస్తుంటారు మలయాళ అగ్రకథానాయకుడు మమ్ముట్టి. ఇప్పుడాయన ‘టర్బో’ చిత్రంతో యాక్షన్ అవతారంలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైశాక్ తెరకెక్కిస్తున్న మాస్ చిత్రమిది. కొన్ని రోజుల క్రితం జూన్ 13న ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్