నిశ్చితార్థమయ్యాక బ్రేకప్ చెప్పిన నటి
ఇర్ఫాన్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘హిందీ మీడియం’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పాకిస్థానీ నటి సబా కమర్. వ్యాపారవేత్త అజీమ్ ఖాన్‌తో సబా నిశ్చితార్థం ఇటీవల...
సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టిన సబా
ముంబయి: ఇర్ఫాన్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘హిందీ మీడియం’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పాకిస్థానీ నటి సబా కమర్. వ్యాపారవేత్త అజీమ్ ఖాన్‌తో ఇటీవల ఆమె నిశ్చితార్థం జరిగింది. కాగా, తాజాగా ఈ భామ పెళ్లికి బ్రేకప్ చెబుతున్నట్టు ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది.
‘‘వ్యక్తిగత కారణాల వల్ల అజీమ్ ఖాన్‌తో నా ఎంగేజ్మెంట్ తర్వాత బ్రేకప్ చెప్తున్నాను. మేమిద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదు. ఇప్పటివరకూ నన్ను సపోర్ట్ చేసిన మీరందరూ ఇకపైనా నాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాను. ఆలస్యం కాకుండా సరైన సమయంలోనే చేదు నిజాలను గ్రహించాను! అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ‘నేను అజీమ్‌ఖాన్‌ను ఇప్పటివరకూ కలవలేదు. కేవలం ఫోన్ల ద్వారా మాత్రమే మేమిద్దరం మాట్లాడుకున్నాం. వ్యక్తిగతంగా ఇది నాకెంతో కఠినమైన సమయం’’ అని ఆమె పేర్కొన్నారు.
కాగా, సబా పెట్టిన పోస్టుపై అజీమ్ స్పందించారు. ‘సబా.. నువ్వు మంచి మనస్సున్న వ్యక్తివి. ఈ భూమ్మీద ఉన్న సంతోషమంతా నీకు దక్కాలని ఆశిస్తున్నాను. దేవుడు నీకు అన్నివేళలా విజయాన్నే అందించాలని కోరుకుంటున్నా. ముళ్లబాట చిట్టచివరికి అందమైన గమ్యస్థానానికి చేరుస్తుంది. అలాగే ఈ బ్రేకప్ పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా’ అని రిప్లై ఇచ్చారు. మరోవైపు, అజీమ్‌కు సబాతో ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని రోజులకే అతనిపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే అజీమ్‌తో తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు సబా ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్వాతి మాలీవాల్‌పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్‌లోకి రాజమౌళి - మహేశ్‌ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన