Rakhi aur Rani ki Prem Kahani: రాకీ, రాణీ ఎప్పుడొస్తున్నారంటే!

కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో వస్తున్న ప్రేమ కథా చిత్రం ‘రాకీ జౌర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ’. రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ నాయకా నాయికలు. షబానా అజ్మీ, జయా బచ్చన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ధర్మ

Updated : 25 Apr 2022 08:47 IST

కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో వస్తున్న ప్రేమ కథా చిత్రం ‘రాకీ జౌర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ’. రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ నాయకా నాయికలు. షబానా అజ్మీ, జయా బచ్చన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌, వయోకామ్‌ 18 సంస్థలు నిర్మిస్తున్నాయి. దీని  విడుదల తేదీని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. 2023 ఫిబ్రవరి 10న ఈ ప్రేమ జంటను మీ ముందుకు తెస్తామని అలియా, రణ్‌వీర్‌లతో తను దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ కరణ్‌ ప్రకటించాడు. వివాహం అనంతరం సెట్స్‌లో అడుగు పెట్టిన అలియా ఆదివారం నుంచి ఈ చిత్రీకరణలో పాల్గొంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని