Ram charan: రెండు విభిన్న గెటప్పుల్లో రామ్‌చరణ్‌?

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Published : 13 Feb 2022 15:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. ఇందులో చరణ్‌ రెండు విభిన్న గెటప్పులో కనిపిస్తారట. ఉన్నతాధికారిగా ఒక గెటప్‌లో సీరియస్‌గా కనిపిస్తూనే సాధారణ వ్యక్తిగా మరో గెటప్‌లో అలరించనున్నారట. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌పైన ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని