శంకర్-చరణ్ మూవీ: బ్యాక్‌డ్రాప్ అదేనా?
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో క్రేజీ కాంబోకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్
ఇంటర్నెట్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో క్రేజీ కాంబోకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ ఓ సినిమాలో నటించనున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ సినిమా చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
శంకర్ అంటే భారీతనానికి పెట్టింది పేరు. అదే సమయంలో చరణ్‌కు మాస్‌లో మంచి ఇమేజ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని శంకర్ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పొలిటికల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుందని ఓ టాక్. గతంలో ‘ఒకే ఒక్కడు’ తరహాలో ఇందులో చరణ్ పాత్ర ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్ అధికారి సీఎం అయితే, సమాజంలో ఎలాంటి మార్పు తెచ్చాడన్న ఇతివృత్తంతో కథ సాగుతుందట. అంతేకాదండోయ్, మరో వార్త కూడా టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఈ కథ ఉంటుందని మరో టాక్. మరి మెగా హీరోను.. ఈ మెగా డైరెక్టర్ ఎలా చూపిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
తర్వాత శంకర్ చిత్రమేనా?
రామ్‌చరణ్ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఇవి పూర్తయిన వెంటనే రామ్‌చరణ్ నేరుగా శంకర్ క్యాంపులో చేరిపోతారని టాక్. మరోవైపు శంకర్ ‘భారతీయుడు2’ ప్రస్తుతానికి పక్కన పెట్టడంతో వీలైనంత త్వరగా చరణ్ సినిమాను మొదలు పెట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
గోధుమ పిండి పంపిణీ కేంద్రాల్లో తొక్కిసలాట: పాకిస్థాన్‌లో 11 మంది మృత్యువాత
-
India News
20 రూపాయలకే మినీ హోటల్లో గది
-
Politics News
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు... న్యాయపరంగానే పోరాడతా
-
Ts-top-news News
టోల్ రూపంలో 9 ఏళ్లలో రూ.9 వేల కోట్ల వసూలు
-
Sports News
ధోనీకి కెప్టెన్‌గా కొంచెం కష్టపడ్డా: స్టీవ్ స్మిత్
-
World News
No Smoking: ఆఫీసులో 4500 సార్లు స్మోకింగ్ బ్రేక్.. అధికారికి రూ.8.8లక్షల జరిమానా