Updated : 02 Jul 2022 07:29 IST

Saitej: రెండో వారం నుంచే...

పవన్‌కల్యాణ్‌ (Pawankalyan) చేతిలో బోలెడన్ని సినిమాలున్నాయి. కొన్ని సెట్స్‌పై ఉండగా, మరికొన్ని స్క్రిప్ట్‌ దశలో ఉన్నాయి. వీటి మధ్యలో మరో కొత్త సినిమాని మొదలుపెట్టారు. అదే... ‘వినోదాయ సిద్ధం’ (Vinodayathra Sitam) రీమేక్‌. తమిళంలో విజయవంతమైన ఈ సినిమా తెలుగు రీమేక్‌లో తన మేనల్లుడు సాయి తేజ్‌తో(SaiTej) కలిసి నటిస్తున్నారు పవన్‌కల్యాణ్‌. ఇప్పటికే కొబ్బరికాయ కొట్టుకున్న ఈ సినిమాని ఈ నెల రెండో వారం నుంచే పట్టాలెక్కిస్తున్నట్టు సమాచారం. పవన్‌కల్యాణ్‌ అటూ ఇటూగా సెట్స్‌పైకి వచ్చినా సాయి తేజ్‌పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నట్టు తెలిసింది. మాతృకని తెరకెక్కించిన సముద్రఖని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్‌ రచన చేశారు. ఇందులో పవన్‌కల్యాణ్‌ మనిషి రూపంలోని దేవుడిగా కనిపిస్తారని సమాచారం.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని