
Samantha: విడాకుల స్టేట్‌మెంట్ డిలీట్ చేసిన సామ్.. ఆశ్చర్యంలో నెటిజన్లు!
హైదరాబాద్: ఆన్‌స్క్రీన్ లవ్లీ పెయిర్‌గా.. మోస్ట్ బ్యూటిఫుల్ సెలబ్రిటీ కపుల్‌గా పేరు తెచ్చుకొన్న సమంత - నాగచైతన్య తమ నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ ఈ ప్రకటన చేసి సుమారు నాలుగు నెలలు అవుతోంది. ఈ నాలుగు నెలల్లో సమంత.. తన సోషల్‌మీడియా ఖాతాల నుంచి చైతన్య ఫొటోలు తొలగించింది. మరోవైపు చైతన్య కూడా సమంతతో విడిపోవడానికి గల కారణాన్ని ఇటీవల బయటపెట్టారు. అయినప్పటికీ నెటిజన్లు మాత్రం వీళ్లిద్దరూ మళ్లీ కలిస్తే బాగుంటుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. చై-సామ్ కలవాలని కోరుకుంటూ నెట్టింట్లో పోస్టులు కూడా పెడుతున్నారు.
కాగా, తాజాగా సమంత చేసిన ఓ పని ఇప్పుడు నెటిజన్లను ఆనందంతోపాటు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె.. చైతన్య నుంచి విడిపోతున్నట్లు చేసిన గతేడాది అక్టోబర్ 2న చేసిన ప్రకటనను తాజాగా తన సోషల్‌మీడియా ఖాతాలను నుంచి తొలగించింది. దీంతో సామ్ ఇన్‌స్టా, ట్విటర్‌లను ఫాలో అయ్యే అభిమానులు గతంలో ఆమె చేసిన పోస్ట్ కనబడకపోవడంతో ఆశ్చర్యపోతున్నారు. సమంత తిరిగి చైతన్యతో కలిసేందుకే ఆనాటి పోస్ట్‌ను తొలగించి ఉండొచ్చని చెప్పుకుంటున్నారు. దీంతో సమంత - చైతన్య కలవనున్నారా?అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
ఇక కెరీర్ పరంగా చూసుకుంటే సమంత - చైతన్య వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఓ వైపు చైతన్య.. ‘బంగార్రాజు’, ‘లవ్‌స్టోరీ’ విజయానందంలో ఉండగా.. సమంత వరుస ప్రాజెక్ట్‌లతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘యశోద’ చిత్రీకరణ దశలో ఉండగా అంతర్జాతీయ సినిమా ‘అరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’లోనూ ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు.