Sara Ali khan: స్వాతంత్య్ర సమరంలో..

వరుణ్‌ ధావన్‌ కథానాయకుడిగా దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌ ధర్మాటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ పతాకంపై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆయే వతన్‌.. మేరే వతన్‌’. ఇందులో సైఫ్‌ అలీఖాన్‌ తనయ సారా అలీఖాన్‌ కథానాయికగా నటించనున్నట్టు వరుణ్‌ ధావన్‌ మంగళవారం ప్రకటించారు.

Updated : 05 Oct 2022 07:08 IST

రుణ్‌ ధావన్‌ (Varun Dhawan) కథానాయకుడిగా దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌ ధర్మాటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ పతాకంపై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆయే వతన్‌.. మేరే వతన్‌’ (Ae Watan Mere Watan) . ఇందులో సైఫ్‌ అలీఖాన్‌ (Sara Ali Khan) తనయ సారా అలీఖాన్‌ కథానాయికగా నటించనున్నట్టు వరుణ్‌ ధావన్‌ మంగళవారం ప్రకటించారు. ఈ నెలలోనే షూటింగ్‌ తొలి షెడ్యూల్‌ మొదలు కానుంది. ఇందులో సారా అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించే స్వాతంత్య్ర సమరయోధురాలిగా నటిస్తోంది. క్విట్‌ ఇండియా పోరాట నేపథ్య కథాంశంగా సాగుతుందీ చిత్రం. అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదల కానుంది. వరుణ్‌కి జోడీగా సారాని ఎంపిక చేశాం అంటూ కరణ్‌జోహార్‌ చేసిన ట్వీట్‌ని వరుణ్‌ ధావన్‌ వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని