Satyadev: సత్యదేవ్‌ ‘ఫుల్‌ బాటిల్‌’

కథానాయకుడు సత్యదేవ్‌ తన తర్వాతి సినిమాగా ‘ఫుల్‌బాటిల్‌’ను ప్రకటించాడు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం బుధవారం జరిగింది.

Updated : 07 Apr 2022 12:05 IST

కథానాయకుడు సత్యదేవ్‌ తన తర్వాతి సినిమాగా ‘ఫుల్‌బాటిల్‌’ను ప్రకటించాడు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం బుధవారం జరిగింది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘తిమ్మరుసు’ ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ‘నూతన కధాంశంతో వినోదాత్మకంగా సినిమా ఉంటుంద’ని సత్యదేవ్‌ తెలిపాడు. చిత్రీకరణకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర వర్గాలు తెలిపాయి. రామాంజనేయులు జవ్వాజి, ఎస్డీ కంపెనీ నిర్మాణంలో.. సర్వాంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్ధ్‌, కూర్పు: సంతోష్‌ కామిరెడ్డి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని