Siddharth: దానివల్ల మా సినిమాకు ఎంతో నష్టం.. ప్రెస్‌మీట్‌ అడ్డుకోవడంపై సిద్ధార్థ్‌

సిద్ధార్థ్‌ నటించిన తాజా చిత్రం ‘చిన్నా’. ఈ సినిమా ప్రెస్‌మీట్‌ను కర్ణాటకలో నిరసనకారులు అడ్డుకోవడంపై ఆయన స్పందించారు.

Published : 30 Sep 2023 11:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటకలో ఇటీవల తనకెదురైన చేదు అనుభవంపై హీరో సిద్ధార్థ్‌ (Siddharth) స్పందించారు. తన సినిమా ప్రెసెమీట్‌ను నిరసనకారులు అడ్డుకోవడంతో ఎంతో నిరాశపడినట్లు తెలిపారు. తన సినిమాకూ అక్కడ జరుగుతున్న జల వివాదానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. దీనివల్ల చిత్రానికి భారీ నష్టం కలిగిందని పేర్కొన్నారు.

‘‘చిన్నా’ సినిమా నిర్మాతగా విడుదలకు ముందే నేను ఈ చిత్రాన్ని చాలా మందికి చూపించాలని అనుకున్నాను. అందులో భాగంగానే చెన్నైలో కొంతమందికి చూపించాను. అలాగే బెంగుళూరులో మీడియాకూ ఈ చిత్రాన్ని చూపించాలని ప్లాన్‌ చేశా. విడుదలకు ముందే 2000 మంది విద్యార్థులకు చూపించాలనుకున్నా. ఇప్పటి వరకు ఏ సినిమా దర్శక నిర్మాతలు ఇలా చేయలేదు. కానీ, బంద్‌ కారణంగా మేం అన్నింటినీ రద్దు చేశాం. దీనివల్ల మాకు భారీ నష్టం వాటిల్లింది.’’

బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్‌ ఆంటోనీ

‘‘దానికి మించిన బాధకరమైన విషయమేమిటంటే మంచి చిత్రాన్ని అక్కడి ప్రజలతో పంచుకోలేకపోయాం. ఇది నాకెంతో నిరాశ కలిగించింది. ప్రెస్‌మీట్‌ తర్వాత అందరికీ సినిమా చూపించాల్సి ఉంది. కానీ, అక్కడ ఏం జరిగిందో మీరంతా చూశారు. అన్ని కెమెరాల ముందు జరిగిన దాని గురించి నేను మాట్లాడదలచుకోవడం లేదు. సినిమాకు మంచి ప్రేక్షకాదరణ వస్తోంది. నా సినిమాకు ఈ వివాదానికి ఎలాంటి సంబంధం లేదు. నేను తీసే సినిమాల్లో సామాజిక బాధ్యత కనిపిస్తుందని నేను నమ్ముతున్నా’’ అని సిద్ధార్థ్‌ అన్నారు. మరోవైపు ఈ సంఘటనపై కర్ణాటక ప్రజల తరపున కన్నడ నటులు సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెబుతున్నారు. ఇప్పటికే ప్రకాశ్‌ రాజ్‌, శివరాజ్‌ కుమార్‌లు ఎక్స్‌ వేదికగా దీనిపై వారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. క్షమాపణలు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని