Mahesh Babu: మహేష్‌ చిత్రంలో ఈ సోయగం?

కొత్త  జంట కొత్త కథానాయిక శ్రీలీల అవకాశాల విషయంలో జోరు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటిస్తున్న ఆమె...అన్నీ కుదిరితే అగ్ర కథానాయకుడు మహేష్‌కి జోడీగా నటించనుంది.

Updated : 27 Nov 2022 07:03 IST

కొత్త  జంట కొత్త కథానాయిక శ్రీలీల (Sree Leela) అవకాశాల విషయంలో జోరు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటిస్తున్న ఆమె... అన్నీ కుదిరితే అగ్ర కథానాయకుడు మహేష్‌కి జోడీగా నటించనుంది. మహేష్‌బాబు (MaheshBabu) - త్రివిక్రమ్‌ (Trivikram) కలయికలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూజాహెగ్డే కథానాయిక. ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమాలో మరో కథానాయికకీ చోటుందనే సంగతి ఎప్పట్నుంచో వినిపిస్తోంది. ఆ అవకాశం శ్రీలీల సొంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిత్రబృందం ఆమెని సంప్రదించి చర్చలు జరుపుతోంది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న చిత్రమిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని