sonali bendre: పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!

‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్‌ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ అనే సిరీస్‌తో తెరపై కనిపించింది.

Updated : 27 Apr 2024 12:33 IST

‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్‌ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ అనే సిరీస్‌తో తెరపై కనిపించింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న ‘ది బ్రోకెన్‌ న్యూస్‌ 2’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న ఆసక్తికర విషయాలివీ..

  • డ్యాన్స్‌ రాకపోతే కథానాయికగా రాణించలేమన్నది అప్పట్లో అందరి అభిప్రాయం. నేను సినీ రంగంలో అడుగుపెట్టే సమయంలో నాకు పెద్దగా డ్యాన్స్‌ రాదు. నృత్యంలో నైపుణ్యం లేదని ఎంతోమంది నృత్య దర్శకులతో చీవాట్లు పెట్టేవారు. అది భరించలేక తర్వాత నాకు ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా శిక్షణ తీసుకునేదాన్ని.
  • మణిరత్నం సర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బొంబాయి’ సినిమాలో ‘హమ్మా.. హమ్మా’ పాటలో అవకాశం వచ్చినప్పుడు ఐదు సినిమాలు చేసిన అనుభవం మాత్రమే ఉంది. డ్యాన్స్‌ మాస్టర్‌ రాజు సుందరంతో కలిసి ఆ పాటకి ఎలాగైనా బాగా చేయాలి అనుకున్నా. నా ప్రదర్శన ఎవరికీ నచ్చకపోతే బ్యాగు సర్దుకొని ఇండస్ట్రీని వదిలి వెళ్లాలనుకున్నా.
  • ‘బొంబాయి’ సినిమాలో నేను భాగం కాకపోయినా.. ‘హమ్మా.. హమ్మా’ పాట మాత్రం నాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అది నా పాటగానే మార్మోగిపోయింది. తర్వాత సినిమాల్లో ఇలాంటి పాటలు మళ్లీ ఎందుకు చేయలేకపోయానే అనే బాధ ఇప్పటికీ ఉంది.
  • ప్రస్తుతం మహిళా ప్రాధాన్య చిత్రాల సంఖ్య పెరుగుతోంది. ఈ వయసులో కూడా నాకు మంచి పాత్రలు చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ‘ది బ్రోకెన్‌ న్యూస్‌ 2’లో అమీనా ఖురేషిగా నేను చేసిన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సిరీస్‌ కూడా తప్పకుండా అందరినీ మెప్పిస్తోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని