Srinidhi Shetty: విక్రమ్‌ సినిమా.. భారీగా డబ్బు తీసుకొన్న ‘కేజీయఫ్‌’ భామ..!

‘కేజీయఫ్‌’తో(KGF) వెండితెరకు ఎంట్రీ ఇచ్చి.. రీనాగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న భామ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty).  ‘కేజీయఫ్‌’ సక్సెస్‌తో ఆమెకు కోలీవుడ్‌ స్టార్‌ హీరో విక్రమ్‌ (Vikram) సరసన నటించే అవకాశం....

Published : 13 Jul 2022 14:19 IST

హైదరాబాద్‌: ‘కేజీయఫ్‌’తో(KGF) వెండితెరకు ఎంట్రీ ఇచ్చి.. రీనాగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న భామ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty).  ‘కేజీయఫ్‌’ సక్సెస్‌తో ఆమెకు కోలీవుడ్‌ స్టార్‌ హీరో విక్రమ్‌ (Vikram) సరసన నటించే అవకాశం వరించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న ‘కోబ్రా’ (Cobra) విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శ్రీనిధి పారితోషికం అంతటా చర్చనీయాంశంగా మారింది. ‘కేజీయఫ్‌’కు తీసుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలోనే ఈసారి ఆమె తీసుకుందని తెలిసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ విక్రమ్‌తో సినిమాకి ఆమె ఎంత తీసుకున్నారంటే.. అక్షరాలా రూ.ఆరు కోట్లు అట..!

విక్రమ్‌ హీరోగా అజయ్‌ జ్ఞానముత్తు తెరకెక్కిస్తోన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కోబ్రా’. విభిన్నమైన కథాంశంతో సిద్ధమవుతోన్న ఈ సినిమాలో విక్రమ్‌ సరసన శ్రీనిధి సందడి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో ఆమె కోలీవుడ్‌కు పరిచయం కానున్నారు. అయితే, ఈ సినిమాలో నటించడం కోసం శ్రీనిధి సుమారు రూ.ఆరు నుంచి ఏడు కోట్లు పారితోషికం తీసుకున్నారట. ‘కేజీయఫ్‌’కు రూ.3 కోట్లు మాత్రమే తీసుకున్నారని, ఆ సినిమా సక్సెస్‌తోనే ఆమె ఈసారి రూ.7 కోట్లు వరకూ డిమాండ్‌ చేశారని అందరూ చెప్పుకొంటున్నారు. చిత్రబృందం సైతం ఆమె డిమాండ్‌కు సుముఖంగానే స్పందించి, అడిగినంత డబ్బు చేతిలో పెట్టిందని పలు పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో పతాకంపై నిర్మితమైన ఈ చిత్రాన్ని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని