Suhasini: హీరో ఒడిలో కూర్చోమన్నారు.. ఇబ్బందిపడ్డా: సుహాసిని

సీనియర్‌ నటి సుహాసిని (Suhasini) ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. తన సినీ కెరీర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 14 Oct 2023 14:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టాలీవుడ్‌ అగ్ర కథానాయకులతో ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి.. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సుహాసిని (Suhasini). ప్రస్తుతం సహాయనటి పాత్రల్లో నటిస్తున్న ఆమె ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. నటిగా తాను ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితుల గురించి మాట్లాడారు.

‘‘గతంలో నేను నటించిన ఓ సినిమా సెట్‌లో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నా. సన్నివేశంలో భాగంగా హీరో ఒడిలో కూర్చోమన్నారు. దానికి నేను అంగీకరించలేదు. ‘‘ఇది భారతదేశం. ఇక్కడ పరాయి వ్యక్తి ఒడిలో ఒక స్త్రీ కూర్చోవడం తప్పు. కాబట్టి నేను ఈ సీన్‌ చేయను’’ అని గట్టిగా వాదించా. మరో షాట్‌లో హీరో తినే ఐస్‌క్రీమ్‌నే నన్నూ తినమన్నారు. అది నాకు నచ్చలేదు. ‘‘వేరే వాళ్లు ఎంగిలి చేసింది నేను తినడం ఏంటి? నాకు ఐస్‌క్రీమ్‌ మార్చండి. లేదంటే సీన్‌ మార్చండి’’ అని గట్టిగా బదులిచ్చా. నా మాటలు విని మా కొరియోగ్రాఫర్‌ షాకయ్యారు. తాను చెప్పిన విధంగా చేయాలన్నారు. దానికి నేను అంగీకారం తెలపలేదు. ఆ ఐస్‌క్రీమ్‌ను కనీసం ముట్టుకోనని చెప్పా’’ అని ఆమె తెలిపారు.

Kushi: సినిమా అద్భుతం.. అది అంత సులభం కాదు: పరుచూరి

తన స్నేహితురాలు నటి శోభనకు కూడా ఓ సమయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైందని సుహాసిని చెప్పారు. ‘‘శోభన నటించిన ఓ సినిమాలో ఇలాంటి సీన్‌నే పెట్టారు. సీన్‌ నచ్చకపోవడంతో ఆమె చేయనని చెప్పింది. దానికి ఆ చిత్ర దర్శకుడు.. ‘‘నువ్వేమైనా సుహాసిని అనుకుంటున్నావా? చేయనని చెప్పడానికి’’ అన్నాడట. ఆమె వెంటనే నాకు ఫోన్‌ చేసి జరిగింది చెప్పింది. సీన్‌ నచ్చకపోతే చేయనని అందరికీ తెలిసిందని అప్పుడు అర్థమైంది’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు