Tejas: ‘రెచ్చగొట్టేవాళ్లని వదిలిపెట్టం’

దేశభక్తి, తెగువ ఉన్న యుద్ధ విమాన పైలట్‌ తేజస్‌ గిల్‌. కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ఆ చిత్రమే ‘తేజస్‌’. సర్వేశ్‌ మేవారా దర్శకుడు. ఆదివారం ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది.

Updated : 09 Oct 2023 14:03 IST

దేశభక్తి, తెగువ ఉన్న యుద్ధ విమాన పైలట్‌ తేజస్‌ గిల్‌. కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ఆ చిత్రమే ‘తేజస్‌’. సర్వేశ్‌ మేవారా దర్శకుడు. ఆదివారం ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. భారీ వైమానిక విన్యాసాలతో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది ట్రైలర్‌. ఇందులో భారతీయ వైమానిక దళం పాకిస్థాన్‌లో చేపట్టే ఒక రహస్య ఆపరేషన్‌లో పాల్గొనే పైలట్‌గా కనిపిస్తోంది కంగన. ‘భారత్‌ని రెచ్చగొట్టే వాళ్లని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’, ‘ఉగ్రవాదం ఈ దేశంలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత శత్రువు కావాలి.. అప్పుడే దాన్ని తరిమికొట్టగలుగుతాం..’ లాంటి సంభాషణలు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. ‘‘తేజస్‌’ అత్యంత ధైర్య సాహసాలున్న ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారి కథ. దేశం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టగల అమ్మాయి ఆమె. ఇది దేశంలోనే మొదటి ఎయిర్‌ యాక్షన్‌ చిత్రం. ‘యురి’ నిర్మాతల నుంచి వస్తున్న మరో దేశభక్తి చిత్రం’ అంటూ నిర్మాణసంస్థ ట్రైలర్‌ని విడుదల చేస్తూ, వివరాలు పంచుకుంది. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 27న థియేటర్లలోకి వస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని