Tollywood Drugs Case: తనీష్‌.. మీకు కెల్విన్‌తో పరిచయాలున్నాయా?

టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ తుదిదశకు చేరుకుంటోంది. ఇప్పటికే పదిమంది సినీ సెలబ్రిటీలను విచారించిన అధికారులు...

Updated : 17 Sep 2021 14:15 IST

ఈడీ విచారణకు హాజరైన నటుడు

హైదరాబాద్‌: టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ తుదిదశకు చేరుకుంటోంది. ఇప్పటికే పదిమంది సినీ సెలబ్రిటీలను విచారించిన అధికారులు వారి వద్ద నుంచి.. కీలక సమాచారం రాబట్టారు. విచారణలో భాగంగా శుక్రవారం ఉదయం నటుడు తనీష్‌ ఈడీ విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్‌ కోణంలో అనుమానాస్పద లావాదేవీల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాలు? ఎఫ్‌ క్లబ్‌లో జరిగే పార్టీలకు ఎప్పుడైనా హాజరయ్యారా? ఎఫ్‌క్లబ్‌లో మాదకద్రవ్యాలు సరాఫరా చేస్తారా? డ్రగ్స్‌ వినియోగించే సెలబ్రిటీలు మీకు ఎవరైనా తెలుసా? అంటూ తనీష్‌పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈడీ నోటీసుల గురించి గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన తనీష్‌.. తనకి కెల్విన్‌తో ఎలాంటి పరిచయాలు లేవని.. అతను ఎవరో కూడా తనకు తెలియదని వివరించారు. అంతేకాకుండా ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని