BiggBoss Telugu 5: శ్రీరామ చంద్ర లవ్‌ట్రాక్‌.. లంచ్‌కు సిరి.. డిన్నర్‌కు హమీదా.. మరి టిఫిన్‌కు?

నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోన్న కార్యక్రమం ‘బిగ్‌బాస్‌’. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనే ఎదురుచూపులకి తెరదించేందుకు ప్రోమో వచ్చేసింది.

Published : 01 Oct 2021 18:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్లేబాయ్‌గా అలరిస్తున్నాడు శ్రీరామచంద్ర. తాజాగా కెప్టెన్సీ టాస్క్‌లో గెలిచి ఇంటి కొత్త కెప్టెన్‌ అయ్యాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ ‘బిబి షో’ పేరుతో ఇచ్చిన టాస్క్‌లో ఇంటి సభ్యులందరూ పాల్గొన్నారు. సిరి.. హమీదాల్లో ఎవరిని ఎంచుకుంటారు?అని శ్రీరామచంద్రను హౌస్‌మేట్స్‌ ప్రశ్నించగా, లంచ్‌కు సిరి.. డిన్నర్‌కు హమీదా ఎంచుకుంటానని చెప్పాడు. మరి టిఫిన్‌కు ఎవరు?అని ప్రశ్నించగా, శ్రీరామ్‌ నవ్వాపుకోలేకపోయాడు. హౌస్‌మేట్స్‌ ఎలా మాట్లాడతారు? ఎలా ప్రవర్తిస్తారు? అన్న దాన్ని అనుకరించి చూపించాడు సన్నీ విజయ్‌. ‘సిరి.. దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు’అని కోరగా, ‘సోమవారం నామినేషన్స్‌లో చూసుకుందాం’ అంటూ సిరి సమాధానంతో సన్నీ షాకయ్యాడు.

ఇక లోబో, ప్రియాంకల మధ్య ‘ఖుషి’ సినిమాలోని నడుమ సీన్‌ రిపీట్‌ చేశారు. బుద్ధిగా చదువుకుంటున్నట్టు కనిపిస్తూనే ప్రియాంక వైపు లోబో ఓరగా చూస్తాడు. అంతే ‘లోబో.. నీ చూపు సరిగా లేదు’ అంటూ భూమికలా ప్రియాంక కస్సుమంది. ఇలా సరదాగా సాగే ఎపిసోడ్‌లో ఒక్కసారిగా మాటల యుద్ధం మొదలైంది. ఈ వారం బెస్ట్‌, వరస్ట్‌ పెర్ఫార్మర్‌ ఎవరో? నిర్ణయించే ప్రయత్నంలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. మరి ఎవరు బెస్ట్‌ పెర్ఫార్మర్‌గా నిలిచారో తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసి ఆనందించండి..



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని