
Chiranjeevi: చిరుతో బాబీ మూవీ.. మరో మల్టీస్టారర్.. కథ అదేనా?
ఇంటర్నెట్‌డెస్క్: వరుస సినిమాలతో జోరుమీదున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. అంతేకాదు, మల్టీస్టారర్ చిత్రాలకు సై అంటున్నారు. ‘ఆచార్య’లో రామ్‌చరణ్‌తో కలిసి పోరాటం చేయనున్న చిరు, ‘గాడ్‌ఫాదర్’లో సల్మాన్‌తో కలిసి నటిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న మరో చిత్రం కూడా మల్టీస్టారర్ అని టాక్ వినిపిస్తోంది. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరు 154వ చిత్రంగా పట్టాలెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. పక్కా మాస్, కమర్షియల్ సినిమాగా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు ప్రీలుక్‌తోనే హింట్ ఇచ్చారు దర్శకుడు బాబీ. ఈ సినిమా కథపై ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే.. ఇందులో చిరంజీవి పోలీస్ ఆఫీసర్ అని టాక్. శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ అని తెలుస్తోంది. తొలుత రౌడీ గ్యాంగ్‌తో కలిసి అందరినీ రఫ్ఫాడిస్తూ చివరకు పోలీస్ ఆఫీసర్‌గా మిగిలిన వారి ఆట కూడా కట్టిస్తారని అంటున్నారు. అంతేకాదండోయ్ ఈ చిత్రం ద్వితీయార్ధంలో ఓ కీలక పాత్ర ఉందట. అది కూడా పోలీస్ ఆఫీసర్ పాత్ర కావటంతో అందులో ఎవరు నటిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. కామెడీ టైమింగ్‌తోనే కాదు, పోలీస్ ఆఫీసర్‌గా గంభీరమైన పాత్రలతోనూ మెప్పించే నటుడు రవితేజ ఇందులో కనిపిస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే రవితేజతో చర్చలు జరిపారని టాక్. దీనిపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.
► Read latest Cinema News and Telugu News