Prajwal Revanna sex abuse case: ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్

ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతరకర వీడియోల వ్యవహారం(Prajwal Revanna sex abuse case) కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతోంది. జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలు ఒకదానిపై ఒకటి తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. 

Published : 08 May 2024 16:35 IST

బెంగళూరు: హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revann)(జనతాదళ్‌ బహిష్కృత)కు సంబంధించిన అశ్లీల వీడియోల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (D K Shivakumar ) తోసిపుచ్చారు. ఆ దృశ్యాలు వైరల్ కావడం వెనక ఉన్నది ప్రజ్వల్ బాబాయ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామే (H D Kumaraswamy) అని ఆరోపించారు. ఆయన బ్లాక్‌మెయిలింగ్ కింగ్ అని, ఈ మొత్తం స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్, ప్రధాన పాత్రధారి ఆయనే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. (Prajwal Revanna sex abuse case)

‘‘ఈ పెన్‌డ్రైవ్ వ్యవహారం గురించి కుమారస్వామికి మొత్తం తెలుసు. దీనిపై కొందరు ఇప్పటికే మాట్లాడుతున్నారు. కుమారస్వామి నా రాజీనామా అడుగుతున్నారు. వక్కళిగల నాయకత్వం కోసం పోటీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన కోరుకున్నట్టుగా నన్ను రాజీనామా చేయనివ్వండి’’ అని ఎద్దేవా చేశారు. ‘‘రాజకీయంగా ఒకరి తర్వాత ఒకరిని తొక్కేయడం ఆయన పని. ఆయన బ్లాక్‌మెయిలింగ్ కింగ్. అధికారులు, రాజకీయ నాయకులతో సహా అందరినీ బెదిరిస్తుంటాడు. ఆయన పని ఆయన్ను చేసుకోనివ్వండి. సమయం వస్తుంది.. అప్పుడు అన్నింటినీ అసెంబ్లీలో చర్చిద్దాం’’ అని అన్నారు.

పెన్‌డ్రైవ్‌ల వెనుక సిద్ధు సర్కారు

ఈ వ్యవహారంలో తన పేరు, తన తండ్రి దేవెగౌడ పేరు లాగొద్దని, రేవణ్ణ కుటుంబం వేరని ఇదివరకు కుమారస్వామి వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై డీకే స్పందిస్తూ.. ‘‘మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు ఆందోళన చెందుతున్నారు? చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, దోషులకు శిక్ష పడాలని చెప్పిన ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు?’’ అని ప్రశ్నించారు. మంగళవారం బెంగళూరులో విలేకరులతో కుమారస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలివిడత ఎన్నికలకు ముందు హసన, బెంగళూరు గ్రామీణ నియోజకవర్గాలతో పాటు రాష్ట్రమంతటా అశ్లీల వీడియోలు విడుదల చేయాలని కాంగ్రెస్‌ ప్రణాళిక సిద్ధం చేసుకుందని నిందించారు. ఇందులోభాగంగా 25 వేలకు పైగా పెన్‌డ్రైవ్‌లను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సూచనతో ఆ పార్టీ కార్యకర్తలు పంపిణీ చేశారని ఆరోపించారు.

రాష్ట్రప్రభుత్వ సూచనతో పని చేసే సిట్‌ను రద్దు చేసి సీబీఐ ద్వారా ఈ కేసును విచారించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో మరిన్ని వివరాలు బయటపడాలంటే డీకేను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించి విచారించాలన్నారు. ప్రజ్వల్‌ ఉదంతంతో పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగిందని భావిస్తే భాజపా ఏ నిర్ణయం తీసుకున్నా తాము సిద్ధమని కుమారస్వామి ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు