
Cinema News: ప్రముఖ దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరరావు కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరరావు (56) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి తన స్వగ్రామం పాలకొల్లు నుంచి హైదరాబాద్ వస్తుండగా మార్గమధ్యంలో ఆయనకు ఫిట్స్ వచ్చి.. అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మరణవార్తపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
నాగేశ్వరరావు చిన్నతనం నుంచే సినీ పరిశ్రమపై మక్కువ పెంచుకున్నారు. దర్శకుడిగా రాణించాలనే ఉద్దేశంతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ‘రిక్షా రుద్రయ్య’ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ ఆయన తెరకెక్కించిన ‘పోలీస్’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టంట్ మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పీటర్ హెయిన్స్ని సైతం ఆయనే పరిచయం చేశారు. ‘శ్రీశైలం’, ‘సాంబయ్య’, ‘దేశద్రోహి’ చిత్రాలు నాగేశ్వరరావుకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.