Induvadana: ఒకటిన.. ‘ఇందువదన’

వరుణ్‌సందేశ్‌, ఫర్నాజ్‌ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఇందువదన’. ఎం.శ్రీనివాసరాజు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ బాలాజీ పిక్చర్స్‌ పతాకంపై మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. కొంచెం విరామం తర్వాత వరుణ్‌ సందేశ్‌ నటించిన ఈ సినిమా ...

Updated : 07 Dec 2022 22:21 IST

రుణ్‌సందేశ్‌, ఫర్నాజ్‌ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఇందువదన’. ఎం.శ్రీనివాసరాజు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ బాలాజీ పిక్చర్స్‌ పతాకంపై మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. కొంచెం విరామం తర్వాత వరుణ్‌ సందేశ్‌ నటించిన ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. జనవరి 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని  నిర్ణయించారు. ‘‘కళాత్మకమైన కథతో రూపొందిన చిత్రమిది. వరుణ్‌ సందేశ్‌ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ ఇందులో నటించారు. సతీష్‌ ఆకేటి కథ, కథనం, మాటలు సమకూర్చారు. విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌, పాటలకి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. చిత్రం కూడా ఇంటిల్లిపాదికీ నచ్చేలా ఉంటుంద’’న్నారు. రఘుబాబు, అలీ, నాగినీడు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శివ కాకాని.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని