Bollywood: జూన్‌ 10న ‘డియర్‌ దియా’

కన్నడలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం ‘దియా’. ఈ చిత్రం హిందీలో రీమేక్‌  అవుతున్న విషయం తెలిసిందే. టైటిల్‌ ‘డియర్‌ దియా’. మాతృకను తెరకెక్కించిన కె.ఎస్‌ అశోకా ఈ చిత్రానికి

Updated : 12 May 2022 08:55 IST

కన్నడలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం ‘దియా’. ఈ చిత్రం హిందీలో రీమేక్‌  అవుతున్న విషయం తెలిసిందే. టైటిల్‌ ‘డియర్‌ దియా’. మాతృకను తెరకెక్కించిన కె.ఎస్‌ అశోకా ఈ చిత్రానికి దర్శకుడు. మిహిక కుశ్వాహా, పృథ్వీ అంబార్‌, ఉజ్వల్‌ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు తమను తాము మరిచిపోయి దియా ప్రేమ ప్రయాణంలో లీనమవుతారని దర్శక నిర్మాతలు తెలిపారు. జూన్‌ 10న విడుదల కానున్న ఈ ప్రేమకథను నెట్‌ఫ్లిక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి కమలేశ్‌సింగ్‌ కుశ్వాహా నిర్మించారు.


పంకజ్‌ త్రిపాఠి ‘షేర్‌దిల్‌’

‘మీర్జాపూర్‌’ సిరీస్‌తో దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమైన విలక్షణ నటుడు పంకజ్‌ త్రిపాఠి. ఆయన ప్రధానపాత్రలో రానున్న చిత్రం ‘షేర్‌దిల్‌’. ఈ చిత్రంలో పంకజ్‌ ‘గంగారామ్‌’ అనే గ్రామపెద్దగా నటించాడు. సయానీ గుప్తా, నీరజ్‌ కబీ తదితరులు నటించారు. శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకుడు. ఈ చిత్రాన్ని జూన్‌ 24న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. 2017లో పీలీభీత్‌ టైగర్‌ రిజర్వ్‌లో జరిగిన అమానుష ఘటనలనే సినిమాకు ఇతివృత్తంగా తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం కోసం టైగర్‌ రిజర్వ్‌ పరిసర గ్రామాల్లో నివసించే కుటుంబాలు తమ ఇంట్లోని వృద్ధులను అడవిలో వదిలేసేవి. వారు పులి దాడిలో మరణించిన అనంతరం ఆ మృతదేహాలను గ్రామ పరిసరాల్లోకి తీసుకొచ్చి పడేసేవారు. తర్వాత పులి గ్రామంపై దాడి చేసినట్లు ప్రభుత్వాన్ని నమ్మించేవారు. ఈ నేపథ్యంలో మృగానికి మానవుడికి మధ్య జరిగే సంఘర్షణను ప్రధానంగా చూపించామని చిత్రబృందం తెలిపింది. టీ సిరీస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని