
యువత ఓటు బైడెన్‌కే!
56% ఆయన వైపే మొగ్గు
న్యూయార్క్: అమెరికాలో ఈసారి యువత ఎన్నికలపై తెగ ఆసక్తి చూపుతున్నారట. వారిలో అత్యధికులు డెమ్రోకటిక్ అభ్యర్థి జో బైడెన్‌కే జై కొట్టబోతున్నారట. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ దేశవ్యాప్తంగా యువ ఓటర్లపై చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 18-29 ఏళ్ల వయస్కులపై చేసిన ఈ సర్వేలో ఓటు వేయడంపై గత కొన్ని దశాబ్దాల్లో చూడనంత ఆసక్తి ఇప్పటి యువతలో కనిపిస్తోందని తేలింది. 63 శాతం మంది యువత తాము తప్పక ఓటు వేస్తామని స్పష్టం చేశారు. కాగా 2016 ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొన్న యువత(47 శాతం)తో పోలిస్తే ఇది చాలా మెరుగు. యువతలో బైడెన్‌పై ఆదరణ గత కొన్ని నెలలుగా పెరుగుతోందని సర్వేలో వెల్లడైంది. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కన్నా బైడెన్ యువ ఓటర్ల ఆదరణలో 24 పాయింట్ల ముందంజలో ఉన్నట్లు సర్వే తేల్చింది. మొత్తంగా 56 శాతం యువ ఓటర్లు బైడెన్ వైపే మొగ్గుచూపుతున్నారని స్పష్టం చేసింది. టెక్సాస్‌లో ట్రంప్ ముందంజ ఎన్నికల్లో కీలక రాష్ట్రాల్లో ఒకటైన టెక్సాస్‌లో బైడెన్ కన్నా ట్రంప్ ఐదు పాయింట్ల మేరకు ముందంజలో ఉన్నట్లు మరో సర్వేలో వెల్లడైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.