Updated : 01/12/2020 00:03 IST

పగబట్టిన విధి

అమెరికాలో నారాయణపేట జిల్లా వాసుల మృతి
దంపతులు, కుమారుడిని బలిగొన్న రోడ్డు ప్రమాదం
చికిత్స పొందుతున్న కుమార్తె

ధన్వాడ, న్యూస్‌టుడే: ఆ తల్లిదండ్రులు తమ ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. బిడ్డలు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పనిచేస్తుండడంతో మురిసిపోయారు. అంతలోనే విధి పగబట్టింది. కొన్నాళ్లు పిల్లలతో గడుపుదామని అక్కడికి వెళ్లిన ఆ దంపతులను, కుమారుడిని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. కుమార్తె తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోంది. అమెరికాలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి... నారాయణపేట జిల్లా మరికల్‌ మండలంలోని పెద్దచింతకుంటకు చెందిన పటేల్‌ నర్సింహారెడ్డి(56) హైదరాబాదు-1 డిపోలో కండక్టరుగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య లక్ష్మి (50), పిల్లలు మౌనిక (28), భరత్‌రెడ్డి (25) ఉన్నారు. మౌనిక 2014లో ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లారు. మూడేళ్ల తరువాత ఆమె తమ్ముడు భరత్‌ కూడా వెళ్లారు. ఇద్దరూ సాప్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. భరత్‌రెడ్డి ఇటీవల డల్లాస్‌లో ఇల్లు కొన్నారు. కొన్ని నెలలుగా కరోనాతో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కొనసాగుతుండడంతో అక్కాతమ్ముళ్లు డల్లాస్‌లోనే నివసిస్తున్నారు. అమెరికాకు వచ్చి తమ వద్ద కొన్నాళ్లు ఉండాలని కుమార్తె కోరడంతో తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, లక్ష్మి జులైలో వందే భారత్‌ మిషన్‌ విమానంలో అమెరికాకు పయనమయ్యారు. ఈ నెల 27న అందరూ కలిసి టెక్సాస్‌ పట్టణంలో తెలిసిన వారి ఇంటికి శుభకార్యానికి వెళ్లారు. అనంతరం శనివారం మధ్యాహ్నం వాహనంలో (భారత కాలమానం ప్రకారం) సమీపంలోని పర్యాటక ప్రాంతాలకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్సింహారెడ్డి, లక్ష్మి, భరత్‌రెడ్డి అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మౌనిక తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు కారులో ప్రయాణించిన తెలుగు యువతి, యువకుడు కూడా గాయపడినట్లు సమాచారం. మౌనికకు అమెరికాలో వివాహ సంబంధాలు వస్తుండడంతో మాట్లాడేందుకు ఆమె తల్లితండ్రులు వెళ్లారని, జనవరి ఒకటిన తిరిగి వచ్చేందుకు విమాన టికెట్లూ బుక్‌ చేసుకున్నారని, అంతలోనే విషాదం చోటుచేసుకుందని గ్రామస్థులు తెలిపారు.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని