జగన్‌ భజన చేసుకోండి.. కానీ..: అచ్చెన్న

స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూల్చివేస్తానంటూ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ

Published : 22 Dec 2020 01:53 IST

అమరావతి: స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూల్చివేస్తానంటూ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మంత్రి కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. 

మంత్రిగా ఉన్న వ్యక్తే సర్దార్‌ బిరుదు గ్రహీతపై బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. సమర యోధులను గౌరవించలేని వ్యక్తి మంత్రిగా ఉండే అర్హత లేదన్నారు. సీఎం జగన్‌ భజన చేయాలనుకుంటే చేసుకోవాలి కానీ.. బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి గౌతు లచ్చన్న గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని