‘కత్తి కంటే కలం పదునైనదని తెలుసుకున్నా’

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సంఘటనల ద్వారా ‘కత్తి కంటే.. కలం పదునైనది’ అనే మాట తనకు అర్థమైందని కాంగ్రెస్‌ నాయకుడు, ఎంపీ శశిథరూర్‌ అన్నారు. దేశంలో చాలా మంది సామాజిక కార్యకర్తలు ఎలాంటి నేరాల్లో తలదూర్చనప్పటికీ..

Published : 18 Oct 2020 02:53 IST

పుణె: ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సంఘటనల ద్వారా ‘కత్తి కంటే.. కలం పదునైనది’ అనే మాట తనకు అర్థమవుతోందని కాంగ్రెస్‌ నాయకుడు, ఎంపీ శశిథరూర్‌ అన్నారు. దేశంలో చాలా మంది సామాజిక కార్యకర్తలు ఎలాంటి నేరాల్లో తలదూర్చనప్పటికీ.. గొంతు విప్పి తమ ఆలోచనల్ని వెల్లడించినందుకు పోలీసుల నిర్బంధంలోకి వెళ్లాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సింబయాసిస్‌ అంతయర్జాతీయ విశ్వవిద్యాలయ అక్షరాస్యత కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ‘నేను పాఠశాల రోజుల్లో కలం.. కత్తి కంటే పదునైనది అనే విషయాన్ని విన్నాను. ఆ విషయాన్ని ఇప్పుడు మనదేశంలో చోటుచేసుకున్న పలు సంఘటనల ద్వారా తెలుసుకోగలిగాను. ఎలాంటి నేరంలో తలదూర్చనప్పటికీ.. కేవలం తమ ఆలోచనల్ని వెల్లడించినందుకు గానూ కార్యకర్తలు వరవరరావు, సుధా భరద్వాజ్‌, ఆనంద్‌ తెల్తుంబ్డే వంటి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఆయుధాలు పట్టలేదు, కనీసం ఎవరి మీదా చేయి చేసుకోలేదు, రాళ్లు కూడా విసరలేదు.. అయినా నిర్బంధానికి గురయ్యారు’అని థరూర్‌ పేర్కొన్నారు.

భీమా కొరేగావ్‌(జనవరి, 2018) హింసకు సంబంధించి వరవరరావు సహా ఇతర కార్యకర్తలను మావోలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని