‘మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు ప్రభుత్వానివే’

హిందూ ఆలయాలపై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను వైకాపా ప్రభుత్వ వ్యాఖ్యలుగా భావిస్తున్నట్లు ఏపీ భాజపా నేత విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొడాలి నానిని అరెస్ట్‌ చేయాలని

Updated : 22 Sep 2020 18:10 IST

అలాగే భావిస్తున్నామన్న భాజపా నేత విష్ణువర్ధన్‌

అమరావతి: హిందూ ఆలయాలపై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను వైకాపా ప్రభుత్వ వ్యాఖ్యలుగా భావిస్తున్నట్లు ఏపీ భాజపా నేత విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొడాలి నానిని అరెస్ట్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడారు. ఆలయాలపై జరుగుతున్న వరుస ఘటనలను చూస్తే ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. కొడాలి నాని వ్యాఖ్యలను ఆయన వ్యక్తిగతమైనవిగా భావించడం లేదన్నారు. సీఎం జగన్‌ తక్షణమే స్పందించి ఆయన్ను కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో హిందువుల విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. హిందూ ఆలయాలు, వ్యక్తులపై దాడులను ఖండిస్తున్నామని.. అంతర్వేది ఘటనలో కేసులు ఎత్తివేసే వరకు పోరాడుతామని విష్ణువర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని