తరుణ్‌ గొగొయి ఆరోగ్యం విషమం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, అసోం మాజీ సీఎం తరుణ్‌ గొగొయి ఆరోగ్యం విషమించింది. శరీరంలోని పలు అవయవాలు దెబ్బతినడంతో ప్రస్తుతం వెంటిలేటర్‌ సపోర్ట్‌పై .......

Published : 22 Nov 2020 01:28 IST

గువాహటి: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, అసోం మాజీ సీఎం తరుణ్‌ గొగొయి ఆరోగ్యం విషమించింది. శరీరంలోని పలు అవయవాల పనితీరు క్షీణించిందని, ప్రస్తుతం వెంటిలేటర్‌ సపోర్ట్‌పై ఉన్నట్టు ఆయన తనయుడు, ఎంపీ గౌరవ్‌ గొగొయి వెల్లడించారు. 85 ఏళ్ల గొగొయికి అక్టోబర్‌లో ఆయాసం రావడంతో గువాహటి వైద్య కళాశాలకు తరలించి అక్కడే ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే, ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అనంతరం ప్లాస్మా థెరఫీ చేయించుకోవడం ద్వారా కోలుకున్న ఆయన అక్టోబర్‌ 25న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మూడు పర్యాయాలు సీఎంగా పనిచేసిన గొగొయి ఆరోగ్యాన్ని తొమ్మిది మంది వైద్యులతో కూడిన బృందం పర్యవేక్షిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని