రాసిస్తా..నితీశ్ మళ్లీ సీఎం కాలేరు: చిరాగ్

నితీశ్‌ కుమార్ మరోసారి ఎప్పటికీ బిహార్ ముఖ్యమంత్రి కాలేరని ఎల్‌జేపీ అధినేత చిరాగ్ పాసవాన్ అన్నారు.

Updated : 03 Nov 2020 13:55 IST

ఖగరియా: నితీశ్‌ కుమార్ మరోసారి బిహార్ ముఖ్యమంత్రి కాలేరని ఎల్‌జేపీ అధినేత చిరాగ్ పాసవాన్ అన్నారు. ‘కావాలంటే నేను రాసిస్తా’నంటూ మంగళవారం ఓటు వేసిన అనంతరం మీడియాతో వ్యాఖ్యానించారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా చిరాగ్‌ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అధికార పార్టీ జేడీయూ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

‘నవంబర్‌ 10 తర్వాత నితీశ్‌ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కాలేరని నేను మీకు రాసిస్తాను. బిహార్, బిహార్ ప్రజలు ముందుండాలని నేను కోరుకుంటాను. అంతకు మించి నా పాత్ర ఏమీ లేదు. బిహార్‌ ప్రజల సూచనలతో సిద్ధం చేసిన భవిష్య ప్రణాళిక ప్రకారం పనిచేయాలని కోరుకుంటున్నాను. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రికి ఎలాంటి ప్రణాళిక లేదు’ అంటూ నితీశ్‌పై మండిపడ్డారు. 

మహాగట్ బంధన్ అభ్యర్థి తేజస్వీ యాదవ్ ఈ రోజు ఉదయం మాట్లాడుతూ..బిహార్ ప్రజలు విద్య, వైద్య సదుపాయాలు, ద్రవ్యోల్బణం వంటి తదితర అంశాలపై ఓటు వేయాలనుకుంటున్నారన్నారు. ఇదిలా ఉండగా..ఈ రోజు 94 నియోజక వర్గాల్లో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. కాగా, రెండో దశ పోలింగ్ ప్రభుత్వ ఏర్పాటులో కీలంగా ఉండనుందని విశ్లేషకులు చెప్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని