
ఆ బాధితురాలు ఎవరికీ ఏమీ కాదు?
హాథ్రస్ ఘటనను ఉద్దేశించి ఆదిత్యనాథ్‌పై రాహుల్ విమర్శలు
లఖ్‌నవూ: దళితులు, ముస్లింలు, ఆదివాసీలను దేశంలో చాలా మంది మనుషులుగా పరిగణించడం లేదని.. ఇది సిగ్గుపడాల్సిన వాస్తవమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హాథ్రస్ హత్యాచార ఘటనను ఉద్దేశించి తాజాగా ఆయన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పించారు. ఎవరూ అత్యాచారానికి గురికాలేదని యూపీ సీఎం, అక్కడి పోలీసులు పదే పదే అంటున్నారని ఆరోపించారు. అంటే ఆ బాధితురాలు వారికి ‘ఎవరూ కాదు’ అని వ్యాఖ్యానించారు. పరోక్షంగా వారు ఆమెను లేక్కే చేయడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ‘బాధితురాలు చెప్పినా పోలీసులు మాత్రం అత్యాచారం జరగలేదని ఎందుకు అంటున్నారు’ అన్న కోణంలో బీబీసీలో ప్రచురితమైన ఓ వ్యాసాన్ని ట్వీట్‌కు జత చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంపై యూపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సీబీఐ విచారణ జరిపేలా కేంద్ర ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా.. బాధిత కుటుంబాన్ని గతవారం రాహుల్ గాంధీ సహా ఆయన సోదరి ప్రియాంక గాంధీ పరామర్శించారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.