తెరాస, భాజపా కార్యకర్తల బాహాబాహీ

తెరాస, భాజపా కార్యకర్తల బాహాబాహీతో జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల విజయాలను వర్ణిస్తూ భాజపా కార్యకర్తలు బస్టాండ్‌ వద్ద ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని అధికారులు తొలగించారు. ఫలితంగా ఎంపీడీవో కార్యాలయం వద్ద..

Updated : 31 Dec 2020 12:07 IST

గొల్లపల్లి: తెరాస, భాజపా కార్యకర్తల బాహాబాహీతో జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల విజయాలను వర్ణిస్తూ భాజపా కార్యకర్తలు బస్టాండ్‌ వద్ద ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని అధికారులు తొలగించారు. ఫలితంగా ఎంపీడీవో కార్యాలయం వద్ద భాజపా కార్యకర్తలు మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. 

స్థానిక ఆర్యవైశ్యభవన్‌లో బుధవారం జరిగే ఓ  కార్యక్రమానికి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హాజరవుతున్నట్లు తెలుసుకున్న భాజపా కార్యకర్తలు.. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కన్నం అంజయ్య ఆధ్వర్యంలో మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సంఘ్‌ భవన్‌కు చేరుకునేందుకు యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం భాజపా కార్యకర్తలను పోలీసులు మధ్యలోనే అడ్డకున్నారు. తెరాస నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎస్సై జీవన్‌ ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాల వారిని శాంతిపజేశారు. స్థానిక భాజపా నాయకులను ముందస్తుగా అరెస్టు చేసినా తోపులాట జరగడం గమనార్హం.

ఇవీ చదవండి..

భార్య ఫొటోలు పెట్టి.. కాల్ ‌గర్ల్‌గా చిత్రీకరించి..

కొవిడ్‌ టీకా త్వరగా ఇప్పిస్తామంటూ..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని