Andhra news: చంద్రబాబు.. ఈ 3 ప్రశ్నలకు జవాబు చెప్పాలి: మంత్రి అంబటి

పోలవరం ప్రాజెక్టు పూర్తి వ్యయం కేంద్రం భరించాలని చట్టంలో ఉంటే..  రాష్ట్రం ఎందుకు నెత్తిన వేసుకుందో చెప్పాలని ఏపీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పోలవరంపై 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చంద్రబాబుకు ఆయన సవాల్‌ విసిరారు.

Published : 02 Dec 2022 01:33 IST

అమరావతి: పోలవరంలో పర్యటించే ముందు తెదేపా అధినేత చంద్రబాబు 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సవాల్‌ విసిరారు. ప్రాజెక్టు వద్ద రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేదని.. ఈ విషయం పోలీసులు చెప్పినా తెలుగుదేశం నేతలు పట్టించుకోలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి వ్యయం కేంద్రం భరించాలని చట్టంలో ఉంటే.. గతంలో రాష్ట్రం ఎందుకు నెత్తిన వేసుకుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘‘పోలవరాన్ని మేం నిర్మిస్తాం.. మీరు డబ్బులివ్వండి అని గత ప్రభుత్వం ఎందుకు భుజాన వేసుకుంది. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. 2018 నాటికి పోలవరం ద్వారా నీళ్లిచ్చి ఎన్నికలకు వెళ్తామని శాసనసభలో బల్లగుద్ది సవాల్‌ చేసి చెప్పారు. మరి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రం వాల్‌ నిర్మాణం ఎలా చేశారు? ఇది  చారిత్రక తప్పిదం కాదా? ఈ మూడింటికి సమాధానం చెప్పిన తర్వాత మమ్మల్ని ప్రశ్నించండి’’ అని అంబటి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని