ఎమ్మెల్యే అనిల్‌వి దొంగ ప్రమాణాలు: ఆనం వెంకటరమణారెడ్డి

తెదేపా అధికార ప్రతినిది ఆనం వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే తన ఆస్తులపై అబద్ధపు ప్రమాణం చేశారని అన్నారు.

Updated : 09 Jul 2023 16:18 IST

నెల్లూరు: ఎమ్మెల్యే అనిల్ తన ఆస్తులపై పచ్చి అబద్ధాలతో దేవుని ఎదుట ప్రమాణం చేశారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ‘‘ ఆస్తి పత్రాల్లో ఉన్న చిరంజీవి ఎవరు? మీ పీఏ నాగరాజు సాక్షి సంతకం ఎందుకు పెట్టారు?కూల్ డ్రింక్ షాపు యజమాని పేరుతో డాక్యుమెంట్లు ఎందుకు ఉన్నాయి.’’ అని ఆనం ప్రశ్నించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి, నాగరాజు, కూల్ డ్రింక్ యజమాని మీ మనుషులు కాదా? అని నిలదీశారు. తప్పుడు ప్రమాణాలు చేసిన అనిల్‌ను భగవంతుడు క్షమించాలని ఆనం ప్రార్థించారు.

2017 ఆగస్టులో క్రికెట్ బెట్టింగ్‌ కేసులో అనిల్‌ను ఎందుకు విచారించారో చెప్పాలన్నారు. బెట్టింగ్‌కు సంబంధం లేదని అంటున్న అనిల్, ఇటీవల తన బాబాయ్ పాపం మోస్తున్నానని చెప్పారని, వాస్తవానికి బాబాయ్, అబ్బాయ్ కలిసే ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడ్డారని ఆనం ఆరోపించారు. ‘బెట్టింగ్ మా బాబాయ్ పనేనని’ పోలీసు విచారణలో ఎందుకు చెప్పలేదన్నారు. ‘‘ అనిల్‌కు ఇంటర్నేషనల్‌ నోటీసులు ఎందుకొచ్చాయి. పెరూలో బంగారు వ్యాపారం ఉందో, లేదో బయటపెట్టాలి. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలి. ముదివర్తిపాళెం కాజ్ వే పనులకు ప్రసన్న వర్గీయులు దొంగ బ్యాంకు గ్యారంటీతో టెండర్లు వేసింది వాస్తవం కాదా?’’అని ఆనం ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు