BJP: రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న కేసీఆర్‌ హామీ ఏమైంది: స్మృతి ఇరానీ

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర తొలివిడత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ముగిసింది. తొలిదశలో భాగంగా 36 రోజుల పాటు పాదయాత్ర

Updated : 24 Sep 2022 16:11 IST

హుస్నాబాద్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర తొలివిడత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ముగిసింది. తొలిదశలో భాగంగా 36 రోజుల పాటు పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరై ప్రసంగించారు. 

‘‘మోదీ ప్రభుత్వం 80కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్‌ ఇచ్చింది. కరోనా వేళ ఉచిత రేషన్‌తో పాటు మహిళలకు డబ్బులు కూడా ఇచ్చి ఆదుకుంది. తెరాస ప్రభుత్వం కొన్నేళ్లుగా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తామన్న సీఎం కేసీఆర్‌ ఇస్తున్నారా? ఎంఐఎం అంటే తెరాసకు భయం, ఆ పార్టీ నేత చెప్పినట్టే కేసీఆర్‌ నడుచుకుంటారు. ఎంఐఎంకు భయపడి.. తెరాస ప్రభుత్వం సెప్టెంబరు 17న విలీనదినం నిర్వహించట్లేదు. ప్రధాని ఆవాస్‌ యోజన పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తున్నాం. పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు తెరాస ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా?’’ అని స్మృతి ఇరానీ ప్రశ్నించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు సీనియర్‌ నేతలు లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌ తదితరులు హాజరయ్యారు. ముగింపు సభకు భాజపా శ్రేణులు భారీగా తరలి వచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని