Bandi sanjay: కేంద్రానికి రాసిన ఆ లేఖపై కేసీఆర్ చర్చకు సిద్ధమా?: బండి సంజయ్
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. బోరు బావుల వద్ద మోటార్లకు మీటర్లు పెట్టడానికి రుణాలివ్వాలని కేంద్రానికి లేఖ రాసిందా? లేదా అని నిలదీశారు.
హనుమకొండ: రాష్ట్రంలో కొందరు పోలీసులు (TS Police) భారాస (BRS) కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) ఆరోపించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో సోమవారం ఆయన పర్యటించారు. పరకాల సబ్‌జైలు నుంచి విడుదలైన భాజపా నేతలను పరామర్శించిన అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు.
‘‘ఈనెల 5న పంగిడిపల్లిలో భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటనలో కొంతమంది రాళ్ల దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన వారిని వదిలేసి భాజపా నేతలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు భారాస కార్యకర్తల్లా మారిపోయారు. కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? మరో మూడు నెలలు మాత్రమే భారాస అధికారంలో ఉంటుంది. చట్టాలను అతిక్రమించి భారాస కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకుంటాం’’ అని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు భారాస ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని బోరు బావుల వద్ద మోటార్లకు మీటర్లు పెడతామని.. రుణమివ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందా? లేదా? అని నిలదీశారు. ఈ విషయంపై కేసీఆర్ చర్చకు సిద్ధమా? అని సంజయ్ సవాల్ విసిరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rohit Sharma: నా దృష్టిలో అతడే కఠినమైన బౌలర్: రోహిత్ శర్మ
-
PM Modi: తెలంగాణలో వచ్చే ఎన్నికల తర్వాత చెప్పింది చేసే ప్రభుత్వం: ప్రధాని మోదీ
-
TMC: దిల్లీలో మాపై లాఠీలు విరిగితే.. పశ్చిమబెంగాల్లోనూ విరుగుతాయ్ : బెంగాల్ మంత్రి పార్థ భౌమిక్
-
Linda Yaccarino:‘ఎక్స్’రోజువారీ యాక్టివ్ యూజర్లను కోల్పోతోంది: లిండా యాకారినో
-
Rajnath: DAD.. రక్షణశాఖ నిధులకు సంరక్షకుడు: రాజ్‌నాథ్
-
The Vaccine War: ‘ది వ్యాక్సిన్ వార్’.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. రెండు రోజులే!