HP BJP Manifesto: ఉమ్మడి పౌర స్మృతి.. ఉచిత స్కూటీలు.. ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్‌!

HP BJP Manifesto: హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను భాజపా విడుదల చేసింది. ఉమ్మడి పౌరస్మృతి, విద్యార్థినులకు స్కూటీలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ వంటి కీలక హామీలు ఇచ్చింది.

Updated : 06 Nov 2022 13:09 IST

శిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని భాజపా హామీ ఇచ్చింది. అలాగే దశలవారీగా ఎనిమిది లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించింది. పార్టీ జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా ‘సంకల్ప్‌ పత్ర’ను ఆవిష్కరించారు. హామీలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 68 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో నవంబరు 12న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఐదు వైద్యకళాశాలల్ని ఏర్పాటు చేస్తామని భాజపా తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. వక్ఫ్‌ ఆస్తులపై పూర్తి స్థాయి సర్వే చేయించి చట్టవిరుద్ధ ఆక్రమణకు చెక్‌ పెడతామని తెలిపింది. మహిళల కోసం ప్రత్యేకంగా హామీలను ఇచ్చిన భాజపా.. 6-12 తరగతుల విద్యార్థినులకు సైకిళ్లు ఇస్తామని తెలిపింది. ఉన్నత విద్య అభ్యసించే వారికి స్కూటీలను అందజేస్తామని ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని తెలిపింది. శనివారం కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీ పసలేని హామీల్ని కురిపించిందని నడ్డా విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని